నవోదయ విద్యాలయాల్లో 166 టీచర్‌ పోస్టులు.. ఏపీ, తెలంగాణలో ఖాళీలు

 నవోదయ విద్యాలయాల్లో 166 టీచర్‌ పోస్టులు.. ఏపీ, తెలంగాణలో ఖాళీలు..
ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..!

NVS ‌.. హైద‌రాబాద్ రీజియ‌న్ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు
కోరుతోంది
.

న‌వోద‌య విద్యాల‌య స‌మితి (NVS) హైద‌రాబాద్ రీజియ‌న్ ఒప్పంద
ప్రాతిప‌దిక‌న166 టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులు
ఏపీ, తెలంగాణ, యానాంలో ఉన్నాయి. ఇంగ్లిష్‌, హిందీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ,
మ్యాథ్స్‌, ఎక‌నామిక్స్‌, బ‌యాల‌జీ త‌దిత‌ర సబ్జెక్టుల్లో ఖాళీలున్నాయి. ఆసక్తి
గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక
చేస్తారు.

మొత్తం ఖాళీలు: 166 (ఏపీ, తెలంగాణ‌, యానాం)

పీజీటీ-52

టీజీటీ-62

మిస్‌లీనియ‌న్ కేట‌గిరి (ఆర్ట్‌, మ్యూజిక్‌)-27

ఎఫ్‌సీఎస్ఏ-25

ముఖ్య సమాచారం:

స‌బ్జెక్టులు: ఇంగ్లిష్‌, హిందీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌,
ఎక‌నామిక్స్‌, బ‌యాల‌జీ త‌దిత‌ర సబ్జెక్టులున్నాయి.

అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో గ్రాడ్యుయేష‌న్‌,
పోస్టు గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌, బీఈడీ అర్హ‌త‌తో పాటు అనుభ‌వం ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: సెప్టెంబర్‌ 17, 2020.

వెబ్‌సైట్‌:https://navodaya.gov.in/

Flash...   POSTAL SCHEMES : SSY : సుకన్య సమృద్ధి యోజన, PPF ఖాతాదారులకి త్వరలో తీపికబురు..!