2019-20 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ఓ వడ్డీ రేటు ఖరారు

 ఈపీఎఫ్ఓ వడ్డీ రేటు ఖరారు, 6 కోట్ల మంది పీఎఫ్ చందాదారులకు ప్రయోజనం.

న్యూఢిల్లీ : ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) చందాదారులకు వడ్డీ రేటు ఖరారైంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్)పై 8.5 శాతం వడ్డీ చెల్లించాలని నిర్ణయించింది. దీంతో దాదాపు 6 కోట్ల మంది ఉద్యోగులు ప్రయోజనం పొందుతారు. 

ఈపీఎఫ్ ఖాతాల్లోని నిధిపై 8.15 శాతం వడ్డీని ప్రస్తుతం జమ చేస్తారు. మిగిలిన 0.35 శాతం వడ్డీని ఈ ఏడాది డిసెంబరులో జమ చేస్తారు. దీనికి సంబంధించిన నిర్ణయాన్ని బుధవారం జరిగిన ఈపీఎఫ్ఓ ట్రస్టీల సమావేశంలో తీసుకున్నారు. 

తన వద్దనున్న కొన్ని పెట్టుబడులను నగదు రూపంలోకి మార్చాలని ఈపీఎఫ్ఓ గతంలో యోచించింది. కానీ కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో మార్కెట్లు స్థిరంగా లేనందువల్ల ఆ యోచనను విరమించుకుంది. 

ఈపీఎఫ్ఓ అత్యున్నత స్థాయి వ్యవస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశం మరోసారి డిసెంబరులో జరుగుతుంది.

Flash...   Salaries Information: మార్చి నెల జీతాలు ఎప్పుడు?