AP కేబినెట్ భేటీ ముగిసింది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక
నిర్ణయాలు తీసుకున్నారు. ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకానికి ఆమోదం తెలిపారు.
రాయలసీమ కరువు నివారణ సాగునీటి ప్రాజెక్టులకు ఓకే చెప్పారు. ఆన్ లైన్ జూదం,
పేకాటలను నిషేధిస్తూ గేమింగ్ చట్టంలో సవరణల్ని ఆమోదించారు. పేకాట ఆడుతూ దొరికితే
కఠినమైన శిక్షలు అమలు చేయాలని నిర్ణయించారు.
ఏపీ స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. విజయనగరం
జిల్లాలో సుజల స్రవంతి పథకానికి..
మచిలీపట్నంలో షటరింగ్ పథకాన్ని ఆమోదించారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఫిషరీస్
యూనివర్సిటీ ఏర్పాటుకు.. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు
స్థలాల కేటాయించేందుకు ఓకే చెప్పారు. పంచాయతీ రాజ్‌శాఖ లో డివిజనల్ డెవలప్మెంట్
పోస్టుల్ని ఆమోదించారు.
ఇటు ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకంపై విమర్శలు వస్తుండటంతో సీఎం జగన్
స్పందించారు. రైతుకు అందే విద్యుత్తు ఎప్పటికీ ఉచితమేనని.. ఒక్క కనెక్షన్ కూడా
తొలగించబోమని.. ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణల వల్ల రైతుపై ఒక్కపైసా భారం కూడా
పడదని హామీ ఇచ్చారు. అమల్లో ఉన్న పథకాన్ని మరింత మెరుగుపరుస్తున్నామని.. వచ్చే
30–35ఏళ్లపాటు ఉచిత విద్యుత్ పథకానికి ఢోకా లేకుండా చేస్తున్నట్లు చెప్పారు.
కనెక్షన్ ఉన్న రైతు పేరు మీద బ్యాంకు ఖాతా ఉంటుంది. కరెంటు బిల్లు డబ్బు అందులో
నేరుగా జమ అవుతందన్నారు. ఉచిత విద్యుత్‌పై పేటెంట్ ఒక్క వైఎస్సార్‌కే ఉందని..
అందుకే పథకానికి ఆయన పేరు అన్నారు సీఎం. శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా
ఉచిత విద్యుత్ పథకం అమలు కానున్నట్లు తెలిపారు.
రైతుకు ఇచ్చే విద్యుత్ ఎప్పటికీ ఉచితమే…
AP కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత విద్యుత్ పథకం నగదు బదిలీకి కేబినెట్
ఆమోదం తెలిపింది. ఈ సందర్బంగా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. రైతుకు
అందే విద్యుత్తు ఎప్పటికీ ఉచితమేనని సీఎం జగన్ పేర్కొన్నారు. రైతుకు ఒక్క పైసా
కూడా భారం పడదన్నారు. 30-35 ఏళ్ళ పాటు ఉచిత విద్యుత్ పథకానికి ఢోకా లేదని
తెలిపారు. కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవడమేనని చంద్రబాబు అన్నారని… కానీ బాబు
మిగిల్చింది రూ. 8 వేల కోట్ల బకాయిలను తమ ప్రభుత్వం తీర్చిందన్నారు. కనెక్షన్
ఉన్న రైతు పేరు మీద ప్రత్యేక ఖాతా తెరుస్తామని.. ఆ ఖాతాలో ప్రభుత్వం డబ్బులు
వేస్తుందని తెలిపారు. ఆ డబ్బును రైతులు డిస్కంలకు చెల్లించాల్సి ఉంటుందని
అన్నారు. దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే అని తెలిపారు.