E-SR updated News on previous news.

 JD Services దేవానంద్ రెడ్డి గారితో E-sr  సమస్య పై ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడటం జరిగింది .ఈ ఎస్ ఆర్ లో వస్తున్న సమస్యలను వారి దృష్టికి తేవటం జరిగింది.  ఈ సమస్యలను పలు దఫాలుగా పై అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినట్లుగా వారికి తెలియజేయడం జరిగింది .

నిన్న ఈరోజు కూడా ఈ ఎస్ ఆర్ లో మార్పులు చేస్తున్న విషయం వారి దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది మిగిలిన శాఖ లలో వలె కాక విద్యాశాఖలో ఉపాధ్యాయులలో చాలా కే డర్లు ఉన్నాయి. అనేక రకాల నియామకాలు, స్పెషల్ టీచర్స్, అప్రెంటిస్ టీచర్స్ ఇంకా అనేక రకాల పద్ధతులలలో నియామకాలు జరిగాయి. ఉపాధ్యాయుల సర్వీస్కు సంబంధించి అనేక సమస్యలుఉన్నాయి .వీటన్నిటినిదేవానంద్ రెడ్డి గారి దృష్టికి  తీసుకుని వెళ్లడం జరిగింది. వీటన్నిటి పైన అవగాహన ఉన్నదనీ,కానీ కేవలం రెండు వేల మంది మాత్రమే e,-Sr పూర్తి చేసినందున, త్వరగా పూర్తి చేయాలనే ఒత్తిడి మన శాఖపై ఉన్నదని ,అందువలన 25లోగా పూర్తి చేయమని ఆదేశించడం జరిగింది అన్నారు. 

71 వేల మంది ప్రారంభించారని ఇంకా లక్ష మంది మొదలు పెట్టలేదనీ వారు అన్నారు.ఒక వారం రోజులలో లక్షమంది ఈఎస్ ఆర్ పూర్తి చేయలేరని, మరికొంత గడువు ఇవ్వాలని వారిని కోరడం జరిగింది.అందరూప్రయత్నం ప్రారంభించండి అని వారు చెప్పారు.

కావున ఉపాధ్యాయులు ఆందోళనకు గురికావద్దు .అయితే  అందరూ E-SRభర్తీ చేసే కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించి ఏవైనా నా సమస్యలు వస్తే వెంటనే సంబంధిత ddo లకు వ్రాతపూర్వకంగా తెలియజేయండి. అదేవిధంగా రాష్ట్ర సంఘానికి రాతపూర్వకంగా తెలియజేస్తే వాటిని పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుంది .ఆసమస్యలు పరిష్కారమయ్యే  వరకు ప్రక్రియ పూర్తి కాదని తెలియ చేయడం జరిగింది.

Flash...   అమ్మ ఒడి తరువాతే టీచర్లకు బదిలీ ఆర్డర్లు