IIT, NIT, IIIT సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ షెడ్యూల్‌ విడుదల.

Joint Seat Allocation Authority 2020

IITs, NITs, IIEST, IIITs and Other-GFTIs for the Academic Year 2020-21

దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీలతోపాటు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక
సహకారంతో నడిచే మరికొన్ని సాంకేతిక విద్యాసంస్థల్లో బీఈ/బీటెక్‌ సీట్ల భర్తీకి
జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ (జోసా) షెడ్యూల్‌ ప్రకటించింది. ఈఏడాది అక్టోబరు
6 నుంచి ఈ ప్రక్రియ మొదలై నవంబరు 7వ తేదీతో ఆరు విడతల సీట్ల కేటాయింపు
ముగుస్తుంది. పూర్తి వివరాలు

https://josaa.nic.in/ వెబ్‌సైట్‌లో
చూడొచ్చు.

దేశవ్యాప్తంగా 111 ప్రముఖ సంస్థల్లో ప్రవేశాలకు జోసా కౌన్సెలింగ్‌ ద్వారా సీట్లు
కేటాయిస్తారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోని ఐఐటీలు, ఎన్‌ఐటీలతోపాటు హైదరాబాద్‌లోని
హెచ్‌సీయూ (ఎంటెక్‌లోని కంప్యూటర్‌ సైన్స్‌ సీట్లకు మాత్రమే), విజయవాడలోని
స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌, కర్నూలు, శ్రీసిటీలోని
ట్రిపుల్‌ఐటీల్లో సీట్లను జోసా ద్వారా భర్తీ చేస్తారు.

రెండు సార్లు మాక్‌ కౌన్సెలింగ్‌:

మొదటి విడత సీట్ల కేటాయింపు కంటే ముందుగా రెండుసార్లు మాక్‌ కౌన్సెలింగ్‌
నిర్వహిస్తారు. అప్పటికే వెబ్‌ ఆప్షన్లు (ఛాయిస్‌ ఫిల్లింగ్‌) ఇచ్చుకున్న వారికి
ఎక్కడ సీట్లు రావచ్చో దీనివల్ల తెలుస్తుంది. అవసరమైతే విద్యార్థులు తమ ఆప్షన్లను
మార్చుకొని మళ్లీ నమోదు చేసుకోడానికి ఇలా చేస్తారు. ఈసారి సీటు వచ్చాక స్వయంగా
వెళ్లి రిపోర్టు చేయాల్సిన అవసరం లేదు. కరోనా కారణంగా ఆన్‌లైన్‌లో ప్రక్రియ
పూర్తి చేయవచ్చు. ఆరు విడతల కౌన్సెలింగ్‌ తర్వాత సీట్లు ఖాళీగా ఉంటే వాటి భర్తీకి
మరో రెండు విడతల కౌన్సెలింగ్‌ను ప్రత్యేకంగా నిర్వహిస్తారు.

కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌:

అక్టోబరు 6: రిజిస్ట్రేషన్‌/ఛాయిస్‌ ఫిల్లింగ్‌ ప్రారంభం

అక్టోబరు 12వ తేదీ: మొదటి నమూనా సీట్ల కేటాయింపు

అక్టోబరు 14వ తేదీ: రెండోసారి నమూనా సీట్ల కేటాయింపు

అక్టోబరు 16వ తేదీ: మొదటి విడత సీట్ల కేటాయింపు

అక్టోబరు 21వ తేదీ: 2వ విడత సీట్ల కేటాయింపు

అక్టోబరు 26వ తేదీ: 3వ విడత సీట్ల కేటాయింపు

Flash...   ఊపిరితిత్తుల ఆరోగ్యానికి హెర్బల్ డ్రింక్స్…!

అక్టోబరు 30వ తేదీ: 4వ విడత సీట్ల కేటాయింపు

నవంబరు 3వ తేదీ: 5వ విడత సీట్ల కేటాయింపు

నవంబరు 7వ తేదీ: 6వ విడత సీట్ల కేటాయింపు.

COUNSELLING SCHEDULE CLICK HERE