SBI లోన్ మారటోరియం అర్హతలు.. రుణగ్రహీతలు కచ్చితంగా తెలుసుకోవాల్సిన 10 విషయాలు!

 


స్టేట్ బ్యాంక్ తన కస్టమర్ల కోసం తీపికబురు తీసుకువచ్చింది. లోన్ తీసుకున్న
వారికి మారటోరియం బెనిఫిట్ అందిస్తోంది. అంటే మరికొన్ని నెలలపాటు ఈఎంఐ
కట్టక్కర్లేదు. దీంతో చాలా మందికి ఊరట కలుగనుంది

దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI నుంచి లోన్ తీసుకున్నారా?
అయితే మీకోసం బ్యాంక్ అదిరిపోయే తీపికబురు తీసుకువచ్చింది. కోవిడ్ 19 ప్రతికూల
పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఊరల కలిగే నిర్ణయం
తీసుకుంది. లోన్ రిస్ట్రక్చరింగ్ బెనిఫిట్‌ను రిటైల్ కస్టమర్లకు అందిస్తోంది.
దీని గురించి తెలుసుకుందాం.

ఎన్ని నెలలు ఈఎంఐ కట్టక్కర్లేదు?

బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్న వారు 1-24 నెలలపాటు అంటే 2 ఏళ్లు పాటు ఈఎంఐ
కట్టక్కర్లేదు. మీరు తీసుకున్న లోన్ ప్రాతిపదికన మీకు లభించే లోన్ మారటోరియం
గడువు కూడా మారుతుంది.

ఏ ఏ రుణాలకు మారటోరియం వర్తిస్తుంది?

బ్యాంక్ అందిస్తున్న ఈఎంఐ మారటోరియం ప్రయోజనం పలు రకాల రుణాలు వర్తిస్తుంది.
హౌసింగ్ లోన్, ఇతర సంబంధిత రుణాలు, ఎడ్యుకేషన్ లోన్, వెహికల్ లోన్, పర్సనల్ లోన్
తీసుకున్న వారికి ఈ ప్రయోజనం అందుబాటులో ఉంది.

ఎప్పటిలోగా మారటోరియం కోసం అప్లై చేసుకోవాలి?

స్టేట్ బ్యాంక్ అందిస్తున్న లోన్ మారటోరియం కోసం రుణ గ్రహీతలు డిసెంబర్ 24లోపు
అప్లై చేసుకోవాలి. అప్పుడే వీరికి లోన్ రిస్ట్రక్చరింగ్ ప్రయోజనం అందుబాటులో
ఉంటుంది.

ఎస్‌బీఐ అందిస్తున్న ఈ ప్రయోజనం అందరికా? కొందరికా?

బ్యాంక్ లోన్ రిస్ట్రక్చరింగ్ బెనిఫిట్ పొందాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. లోన్
తీసుకున్న వారి ఆగస్ట్ నెలలో జీతంలో కోత ఉండాలి. ఫిబ్రవరి నెలతో పోలిస్తే
ఆగస్ట్‌లో తక్కువ జీతం తీసుకోవాలి. లాక్‌డౌన్‌లో ఉద్యోగం పోవడం, వ్యాపారం క్లోజ్
కావడం వంటివి జరిగి ఉండాలి.

వీరికి మాత్రం నో ఛాన్స్

2020 మార్చి 1 తర్వాత బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్న వారికి లోన్ రిస్ట్రక్చరింగ్
బెనిఫిట్ అందుబాటులో లేదు. అంటే ఫిబ్రవరి నెల చివరి వరకు తీసుకున్న రుణాలకు
మాత్రమే లోన్ మారటోరియం వర్తిస్తుంది.

Flash...   CYCLONE : అసని తుఫాను తీవ్ర తుఫానుగా మారే అవకాశం

ఎస్‌బీఐ లోన్ మారటోరియం కోసం ఎలా అప్లై చేసుకోవాలి?

బ్యాంక్ వెబ్‌సైట్ www.sbi.co.in కు వెళ్లాలి. అక్కడ అప్లై చేసుకోవడానికి అవకాశం
ఉంటుంది. ఇక్కడ మీకు ఒక ఓటీపీ వస్తుంది. దీన్ని ఎంటర్ చేయాలి. తర్వాత మీ
మొబైల్‌కు రెఫరెన్స్ నెంబర్ వస్తుంది. దీన్ని తీసుకొని బ్యాంకుకు వెళ్లి లోన్
మారటోరియం బెనిఫిట్ పొందొచ్చు. ఈ రెఫరెన్స్ నెంబర్ వాలిడిటీ 30 రోజులు ఉంటుంది.

ఈ డాక్యుమెంట్లు కచ్చితంగా ఉండాల్సిందే!

ఫిబ్రవరి నెల శాలరీ స్లిప్ కావాలి. అలాగే సెప్టెంబర్ నెల లేదా లేటెస్ట్ నెల శాలరీ
స్లిప్ అవసరం అవుతుంది. లోన్ మారటోరియం ముగింపు తర్వాత ఎంత ఆదాయం వస్తుందో
డిక్లరేషన్ ఇవ్వాలి. జాబ్ పోతే ఆ లెటర్ అందించాలి. బ్యాంక్ శశాలరీ అకౌంట్
స్టేట్‌మెంట్ అందించాలి. అదే బిజినెస్ చేస్తుంటే కోవిడ్ 19 కారణంగా వ్యాపారం
దెబ్బతిందని డిక్లరేషన్ ఇవ్వాలి.

మారటోరియం ముగింపు తర్వాత ఏమౌతుంది?

మీరు లోన్ మారటోరియం బెనిఫిట్ పొందిన తర్వాత మీ లోన్ టెన్యూర్ పెరుగుతుంది. మీరు
ఎన్ని నెలలు ఈఎంఐ కట్టలేదో అన్ని నెలలు ఈ టెన్యూర్ పొడిగిస్తారు. మారటోరియం
ప్రయోనం పొందే వారు వడ్డీ భారం మోయాల్సి ఉంటుంది. 0.35 శాతం అదనపు వడ్డీ
పడుతుంది.

ఒకటి కన్నా ఎక్కువ రుణాలకు మారటోరియం వర్తిస్తుందా?

స్టేట్ బ్యాంక్ ఒకటి కన్నా ఎక్కువ అకౌంట్లకు మారటోరియం బెనిఫిట్ అందిస్తోంది.
అంతే మీరు రెండు రకాల రుణాలు తీసుకొని ఉంటే రెండింటి కోసం లోన్ మారటోరియం
బెనిఫిట్ పొందొచ్చు.

ఎన్ని రోజుల్లో రిస్ట్రక్చరింగ్ ప్రాసెస్ పూర్తవుతుంది?

మీరు అప్లై చేసుకున్న దగ్గరి నుంచి 7 రోజుల దగ్గరి నుంచి 10 రోజుల్లోగా మీకు లోన్
మారటోరియం ప్రయోజనం వర్తిస్తుంది. మీకు వెబ్‌సైట్‌లో ఎలిజిబిలిటీ లభిస్తుంది.
మీరు బ్యాంకుకు డాక్యుమెంట్లు సమర్పించిన తర్వాతనే అసలు ప్రక్రియ మొదలవుతుంది.

For complete information
Click Here