SONU SOODH SCHOLARSHIPS

 లాక్‌డౌన్ సమయంలో కొన్ని వేల మంది వలస కార్మికులకు అండగా నిలిచి తన గొప్ప
మనసును చాటుకున్నాడు నటుడు సోనూ సూద్. ఎంతో మంది వలస కార్మికులను ఇళ్లకు
చేర్చాడు. కొంతమందికి ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు మరో పెద్ద
సమస్య సోనూ దృష్టికి వచ్చింది. తమ పిల్లలకు ఉన్నత విద్యను అందించడానికి అణగారిన
వర్గాలకు చెందిన ప్రజలు  పడుతున్న ఇబ్బందులను సోనూ గమనించాడు. దీంతో వీరిని
ఆదుకునేందుకు రంగంలోకి దిగాడు.

వారందరి కోసం ఓ ప్రత్యేక స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ను రూపొందించాడు. ఉన్నత విద్యను
అభ్యసిస్తున్న అణగారిన వర్గాల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇస్తానని
ప్రకటించాడు. వార్షికాదాయం రూ.2 లక్షలకు లోపు ఉన్న కుటుంబాలకు చెందిన, మెరుగైన
ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరూ  ఈ స్కాలర్‌షిప్‌నకు అప్లై చేసుకోవచ్చు.
మెడిసన్, ఇంజినీరింగ్, రోబోటిక్స్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, బిజినెస్ స్టడీస్,
జర్నలిజమ్ మొదలైన వృత్తి విద్యా కోర్సులు చదువుతున్న వారందరూ దీనికి అర్హులేనని
సోనూ ప్రకటించాడు. దీనికి అప్లై చేసుకోవాలనుకునే వారు scholarships@sonusood.me
మెయిల్‌కు పది రోజుల్లో తమ వివరాలను పంపించాలి.

Hindustaan Badhega Tabhi, Jab Padhenge Sabhi!
Launching full scholarships for students for higher education.I believe,financial challenges should not stop any one from reaching their goals.Send in ur entries at scholarships@sonusood.me (in next 10 days) & I will reach out to u🇮🇳 pic.twitter.com/JPBuUUF23s

— sonu sood (@SonuSood) September 12, 2020

Flash...   CAT Admit Card 2023 : ఈనెల 7వ తేదీన క్యాట్‌ అడ్మిట్‌ కార్డులు విడుదల.. పూర్తి వివరాలివే