SP BALU…అందుకే ఆయన స్పెషల్

 ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం ఎన్నో జ్ఞాపకాలను వదిలి వెళ్లిపోయారు. సంగీత
ప్రపంచం మూగబోయిందా అన్నట్లుగా ఉంది ఆయన లేరు అంటే. ఇంకా సంగీత ప్రపంచం ఆయన లేరని
నమ్మడం లేదు. అంతగా ఆయన అందరిలో చోటు సంపాదించుకున్నారు. భాష ఏదైనా బాలు గాత్రంలో
అది మధురమే. అందుకే బాలుని మరిచిపోలేకపోతుంది సంగీత ప్రపంచం. ఆయన పాట పాడితే..
ఆయన పాడినట్లు ఉండదు. ఏ సెలబ్రిటీకి ఆయన పాడుతున్నాడో.. ఆ సెలబ్రిటీనే నిజంగా
పాడుతున్నాడా? అనిపించేలా మెస్మరైజ్‌ చేశారు బాలు. హీరోలే కాదు.. కమెడియన్స్‌కు
కూడా ఆయన అందించిన గాత్రం ఇప్పటికీ, ఎప్పటికీ మాట్లాడుకునేలా ఉంటుందంటే.. బాలు
గొప్పతనం ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

తాజాగా బాలు వైవిధ్యమైన గాత్రంతో ఓ షో లో పాడిన పాటల వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో
వైరల్‌ అవుతుంది. భాష ఏదైనా సంగీతానికి ఎల్లలు లేవనేది నిరూపిస్తూ.. బాలు తన
వాయిస్‌తో ఆశ్చర్యపరిచిన.. ఈ వీడియో చూస్తే.. బాలు అందరికీ ఎంత స్పెషలో
అర్థమవుతుంది.

Flash...   GO MS 114 Regularisation of Contract Employees in AP