నోబెల్‌ శాంతి పురస్కారానికి ట్రంప్‌ నామినేట్‌

వాషింగ్టన్‌ : అత్యంత ప్రతిష్టాత్మక నోబెల్‌ శాంతి పురస్కారం-2021కి అమెరికా
అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నామినేట్‌ అయ్యారు. ఈ మేరుకు నార్వే ఎంపి
క్రిస్టియన్‌ జడ్డే ట్రంప్‌ పేరును నామినేట్‌ చేశారు. ఇజ్రాయెల్‌-యుఎఇ మధ్య గతంలో
ట్రంప్‌ చారిత్రక శాంతి ఒప్పందం కుదిర్చారు. అందుకు గానూ ట్రంప్‌ నామినేట్‌
అయ్యారని క్రిస్టియన్‌ జడ్డే పేర్కొన్నారు. మధ్యప్రాచ్యంలో సైనిక దళాల తగ్గింపుతో
పాటు శాంతి సాధనకు ట్రంప్‌ విశేషంగా కృషి చేశారని కొనియాడారు. ఇప్పటి వరకూ
నలుగురు అమెరికా అధ్యక్షులు నోబెల్‌ శాంతి బహుమతిని అందుకున్నారు. రూజ్‌వెల్ట్‌,
వుడ్రూ విల్సన్‌, జిమ్మీ కార్టర్‌, బరాక్‌ ఒబామా నోబెల్‌ శాంతి బహుమతి అందుకున్న
వారిలో ఉన్నారు

Flash...   90-minute British DnaNudge Covid-19 test