బదిలీల సమాచారం: 15.09.2020

ఈరోజు జరిగిన విద్యా శాఖ సమీక్ష సమావేశంలో బదిలీల పై సీఎం స్పందించారు . బదిలీలపై
ప్రొసీడ్ అవమని చెప్పినట్లుగా సమాచారం. కావునఒకటి రెండు రోజుల్లో సీఎం గారి సంతకం
అయితే జీవో విడుదల అయ్యే అవకాశం ఉంది..
విద్యార్థులూ ,ఉపాధ్యాయుల నిష్పత్తికి అనుగుణంగా ఉపాధ్యాయ బదిలీలు జరపాలని
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశం..
FAPTO STATE :
ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు జరిపిన విద్యాశాఖ సమావేశం లో ఉపాధ్యాయుల బదిలీల
అంశం ప్రస్తావనకు వచ్చింది. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి, వెంటనే చర్యలు
తీసుకోవాల్సిందిగా సెక్రటరీ వారికి సూచించారు. రేపు బదిలీలకు సంబంధించి జీవో
విడుదల అయ్యే అవకాశం ఉంది.
జి వి నారాయణ రెడ్డి, ఛైర్మన్
కె నరహరి, సెక్రటరీ జనరల్