మొబైల్ లో ఇంటర్ నెట్ వాడుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త..!

మీరు ఇంటర్ నెట్ ను బాగా వాడుతున్నారా! ఇంటర్ నెట్ లో వివిధ వెబ్ సైట్స్
చూసే అలవాటు ఉందా? అయితే సైబర్ నేరగాళ్ల తదుపరి టార్గెట్ మీరే అయ్యే అవకాశం ఉంది
జాగ్రత్త! మీరు కాలక్షేపానికి వీక్షీoచే కొన్ని రకాలైన డేటింగ్ వెబ్ సైట్స్ ను
ఎరగా చేసుకొని సైబర్ నేరగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు.ఈ విధమైన నేరాలలో
డేటింగ్ వెబ్ సైట్స్ లో రిజిస్ట్రేషన్ కోసం ఇచ్చిన మొబైల్ నెంబర్ వాట్సప్ ద్వారా
పరిచయం చేసుకుంటారు. 

మిమ్మల్ని మాటలతో బాగా మాయ చేసి, వారు ఏదో ఒక పోర్న్ సైట్ ద్వారా సేకరించినటువంటి
వీడియోలను ల్యాప్ టాప్ ద్వారా కానీ లేక మరొక మొబైల్ ద్వారా కానీ ప్లే అయ్యేటట్లు
చేసి, ఆ వీడియోను తామే చేసినట్టుగా చేస్తారు. చేయకూడని పనులను చేయించి వాటిని
స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్ ద్వారా రికార్డు చేస్తారు. మీరు వాటిని తెలుసుకోలేక
పోతారు. తరువాత మిమ్మల్ని డబ్బుల కోసం బెదిరించడం మొదలు పెడతారు. మీరు డబ్బులు
ఇవ్వని యెడల ఆ వీడియోను వివిధ సామాజిక మాధ్యమాల్లో పెడతామని బెదిరిస్తారు. మీరు
పరువు కోసమని సైబర్ నేరగాళ్లకు వారు అడిగినంత డబ్బులు వేస్తూ వస్తారు. 

ఇటీవలే కాలంలో సైబర్ నేరగాళ్లు ఇటువంటి పంథాలోనే బెదిరింపులకు పాల్పడి భారీ
మొత్తాలలో డబ్బులు వసూలు చేస్తున్నారు. డేటింగ్ వెబ్ సైట్స్ , ఇతర వెబ్ సైట్లను
ఉపయోగించకపోవడం శ్రేయస్కరం. అంతేకాక మీరంటే గిట్టని వాళ్ళు మీ మొబైల్ నెంబర్ ను
డేటింగ్ వెబ్ సైట్స్ లలో ఉంచి మీ పేరు, వివరాలతో మీరు చాట్ చేసినట్టు వారితో చాట్
చేస్తున్న చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. అటువంటి నేరాలు జరిగినప్పుడు వెంటనే
మీ దగ్గరలోని పోలీస్ స్టేషన్ ను గాని లేక సైబర్ క్రైమ్ పోలీస్ వారికి ఫిర్యాదు
చేయండి.డేటింగ్ వెబ్ సైట్స్ లలో సబ్ స్క్రైప్ చేసుకోకుండా ఉండడం మంచిది. డేటింగ్
వెబ్ సైట్స్ నుంచి వచ్చిన లింకులను క్లిక్ చేయకుండా ఉండడం. 

Flash...   Income Tax new web portal 2.0

తెలియని వ్యక్తులతో మీ వాట్సప్ నెంబర్, మెయిల్ ఐడిలు షేర్ చేసుకోకూడదు. తెలియని
వ్యక్తులతో వీడియో కాల్స్ మాట్లాడకండి. ఈ విధంగా ఎవరైనా బెదిరించిన ఎడల మీరు
డబ్బులు వేయకండి. ఏమైనా సమస్యలుంటే స్ధానిక పోలీసు స్టేషన్ లో గాని, సైబర్ ల్యాబ్
పోలీసులకు గాని లేదా
సైబర్ మిత్ర వాట్సప్ నెం. 9121211100 కు
గాని సంప్రదించి ఫిర్యాదు చేయాలని ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప
కాగినెల్లి ఐపియస్ తెలిపారు.