తనిఖీలు మొదలయ్యాయి: పాఠశాలలను తనిఖీ చేస్తున్న నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్

ఈ నెల 17 వరకు ప్రైవేట్, ఆ తర్వాత నుంచి ప్రభుత్వ పాఠశాలలు

వసతుల వివరాలు జియో ట్యాగింగ్

జిల్లాలో 100 తనిఖీ బృందాల ఏర్పాటు

డీఈఓ గంగాభవాని వెల్లడి

 ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఉన్న బోధన, మౌలిక వసతుల లెక్క తేల్చుతోంది. ఇందుకోసం జిల్లాలో ప్రాథమికంగా 100 తనిఖీ బృందాలు సోమవారం నుంచి తమ కార్యాచరణ ప్రారంభించాయి. ఈ నెల 17 వరకు ప్రైవేటు, కార్పొరేట్పా ఠశాలలు, ఆ తర్వాత నుంచి ఈ నెలాఖరు వరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఈ తనిఖీలు కొనసాగుతాయి. ఈ బృందాలు ఇచ్చే నివేదికల ఆధారంగానే ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులను నిర్ణయించనున్నట్టు సమాచారం.  పాఠశాలల తనిఖీ బాధ్యతలను ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పాఠశాలల నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్(ఏపీఎస్ఈ ఆర్ఎంసీ)కు అప్పగించింది.

కమిషన్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి 2019-20 విద్యా సంవత్సరం ఆయా పాఠశాలల స్థితిగతులను అంచనావేసి వాటి ఆధారంగా రిపోర్టు ఆన్లైన్లో నమోదు చేయనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో తనిఖీ నివేదికల ఆధారంగా ప్రభుత్వం అవసరమైన వసతులను కల్పిస్తుంది. 

జిల్లా వ్యాప్తంగా 3,662 ప్రభుత్వ, 1,268 ప్రైవేట్ పాఠశాలలను తనిఖీ చేయనున్నారు. ఈ తనిఖీలను డీఈఓ పర్యవేక్షిస్తారు. పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయుల వివరాలు, మౌలిక వసతులు, బోధనా వసతులు తదితర వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన ఫార్మాట్లో తనిఖీ బృందం నింపి జియో ట్యాగింగ్ చేయాల్సి ఉంటుంది. 

ఉన్నత పాఠశాలల తనిఖీకి

గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయుడు, సెకండరీ గ్రేడ్ టీచర్, గ్రామ,వార్డు సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్, ఇంజినీర్ అసిస్టెంట్లతో నలుగురు సభ్యుల తనిఖీ బృందాన్ని ఏర్పాటు చేశారు.

ప్రాథమిక పాఠశాలల్ని గ్రేడ్-2 హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్, గ్రామ, వార్డు సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్, ఇంజినీర్ అసిస్టెంట్లతో నలుగురు సభ్యుల బృందాలు తనిఖీ చేస్తాయి. ఈ బృందాల్లో నియమితులయ్యే ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు వారు పనిచేస్తున్న మండలంలో కాకుండా వేరే మండలంలో తనిఖీ బాధ్యతలు అప్పగించారు.

వివరాలు జియో ట్యాగింగ్…

Flash...   ప్రతి భారతీయుడికీ హెల్త్ కార్డు: మోదీ

తనిఖీ బృందాలు ఆయా పాఠశాల భవనాలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల సంఖ్య, పరీక్షల ఫలితాలు, మౌలిక వసతులు వంటి వివరాలన్నింటిని పరిశీలిస్తాయి. 

యుడైస్పో ర్టల్ వివరాల ఆధారంగా వాస్తవ పరిస్థితిని పరిశీలన చేస్తాయి. తేడాలు ఉంటే గుర్తించి నోట్ చేసుకుంటారు.  వివరాలు నమోదు చేసిన ఫార్మాట్ ను వెబ్ సైట్లో అప్ లోడ్ చేస్తారు. దీంతో పాటు  పాఠశాల భవనాలు, మరుగుదొడ్లు, ఇతర వసతుల ఫొటోలు, జియో ట్యాగింగ్ చేస్తారు. వివరాలన్నింటినీ ఎప్పటికప్పుడు www.apsermc.ap.gov.in వెబ్ సైట్ లో పొందుపరుస్తారు.

తనిఖీలు మొదలయ్యాయి

ఆంధ్రప్రదేశ్ పాఠశాలల నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల స్థితిగతులపై తనిఖీలు చేపడతున్నాం. సోమవారం నుంచి తనిఖీలు మొదలయ్యాయి. ఈ నెల 17 వరకు ప్రైవేట్, ఎయిడెడ్, ఆ తర్వాత 31వ తేదీ వరకు ప్రభుత్వ పాఠశాలల్లో బృందాలు తనిఖీ చేయనున్నాయి. యూడైస్ మేరకు వసతులు ఉన్నాయో లేదో చూసి జియోట్యాగింగ్ చేపట్టనున్నాం. ప్రస్తుతానికి జిల్లాలో 100 తనిఖీ బృందాలను ఏర్పాటు చేశాం. అవసరమైతే మరిన్ని బృందాలను ఏర్పాటు చేస్తాం.

– *గంగాభవాని, డీఈఓ*