మాస్కులు అతిగా వాడితే…ప్రమాదమా..!

 హోస్టన్‌ : కరోనా కారణంగా మాస్కు ధరించడం అందరికీ నిత్యకృత్యమైపోయింది.
ముఖానికి మాస్కు లేనిదే బయటకు రాని పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే మాస్కులు అతిగా
వాడటం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతాయంటూ సోషల్‌ మీడియాలో అనేక వార్తలు ప్రచారం
అవుతున్నాయి. మాస్కులు వాడటం వల్ల కార్బన్‌డయాక్సైడ్‌ స్థాయి పెరిగి,
ఊపిరితిత్తుల సమస్యలు ఉత్పన్నమవుతాయంటూ ప్రచారం అవుతున్నాయి. 

అయితే ఈ వార్తలను అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్‌ మియామీ ఖండించింది. అవి వట్టి
అపోహలు మాత్రమే అని, మాస్కుల వినియోగం వల్ల ఎలాంటి దుష్పరిణామాలూ సంభవించవని
తేల్చి చెప్పింది. మాస్కులు ధరించడం వల్ల ఆరోగ్యవంతులైన వ్యక్తుల్లో ఆక్సిజన్‌,
కార్బన్‌డయాక్సైడ్‌ స్థాయిల్లో మార్పు జరిగి అనారోగ్య పాలవుతారన్న వార్తల్లో నిజం
లేదని, అయితే క్రానిక్‌ అబ్‌స్ట్రాక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌ (సిఒపిడి)తో
బాధపడేవారిలో ఈ సమస్య ఎదురుకావచ్చని పేర్కొంది.

 సిఒపిడి సమస్య ఉన్నవారు ఊపిరి పీల్చుకోవడానికి చాలా ఇబ్బందిపడతారని,
అందువల్లే వారికి ఈ సమస్య ఎదురు కావొచ్చని అధ్యయనంలో పాల్గొన్న మైఖేల్‌ కాంపోస్‌
తెలిపారు

Flash...   New Timing Of AP Schools For Primary, UP And High School 2021 – 22