కరోనా వైరస్‌ మలి దశ పంజా! భారత్‌కు ‘సెకండ్‌వేవ్‌’ భయం!

కరోనా: భారత్‌కు ‘సెకండ్‌వేవ్‌’ భయం!

వచ్చేనెల 3, 4 వారాల్లో ఉండొచ్చంటున్న నిపుణులు

కరోనా ఫస్ట్‌వేవ్‌ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం

కరోనా మరోసారి కోరలు చాస్తుందా? ఉధృతి తగ్గినట్లు కనిపిస్తున్న ఈ మహమ్మారి మరోసారి విజృంభిస్తుందా?… ఆ ప్రమాదం పొంచివుందని, ‘సెకండ్‌వేవ్‌’మొదలయ్యే అవకాశాలున్నాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. వచ్చే నెల మూడు, నాలుగు వారాల్లో లేదా డిసెంబర్‌ మొదటి వారంలో కోవిడ్‌ ఉధృతి మళ్లీ పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. ఏ మహమ్మారి అయినా సెకెండ్‌వేవ్‌లో వ్యాధి తీవ్రత హెచ్చుగా ఉంటుందంటున్నారు. ఇప్పటికే ఫ్రాన్స్, అమెరికా, తదితర పశ్చిమదేశాల్లో కోవిడ్‌ సెకెండ్‌వేవ్‌ కేసులు, ప్రభావం క్రమంగా పెరుగుతున్నట్టుగా వార్తలొస్తున్నాయి. మనదేశంలో తొలిదశ కరోనా వ్యాప్తి (ఫస్ట్‌వేవ్‌) ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టడం మొదలైందని, త్వరలోనే సెకెండ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాల్సి ఉంటుందనే అభిప్రాయం వైద్యవర్గాల్లో వ్యక్తమవుతోంది.

పండుగల సీజన్‌లో వైరస్‌ వ్యాప్తిచెందకుండా ప్రజలు ఏమేరకు ముందు జాగ్రత్తలు తీసుకున్నారనే దానిపై సెకెండ్‌వేవ్‌ తీవ్రత ఆధారపడి ఉండొచ్చునని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య తగ్గుతున్నా, మరికొన్ని రాష్ట్రాల్లో 2 వారాలుగా అధిక కేసులు నమోదవుతున్నాయి. మహమ్మారులు పూర్తిగా అంతమొంది, కనుమరుగైపోవడానికి ముందు ‘మల్టీపుల్‌ వేవ్స్‌’గా వస్తాయని, ఇది ప్రపంచవ్యాప్తం గానూ లేదా కొన్నిదేశాల్లో స్థానికంగానూ జరిగే అవకాశాలున్నాయని యశోద చీఫ్‌ ఇంటర్వెన్షెనల్‌ పల్మనాలజిస్ట్‌ డా. హరికిషన్‌ గోనుగుంట్ల తెలిపారు. మళ్లీ ఆసుపత్రుల్లో కోవిడ్‌ అడ్మిషన్లు నెమ్మదిగా పెరుగుతున్నాయని, గతంలోనూ ఇదేవిధంగా నెమ్మదిగా అడ్మిషన్లు మొదలై ఆ తర్వాత కేసుల తీవ్రత, వైరస్‌ వ్యాప్తి పెరిగిందనే విషయాన్ని అర్థం చేసుకోవాలని చెప్పారు. సెకెండ్‌వేవ్‌తో ముడిపడిన వివిధ అంశాలపై ‘సాక్షి’తో పంచుకున్న అభిప్రాయాలు ఆయన మాటల్లోనే..

వచ్చేది చలికాలం…

మనదేశం కరోనా బారినపడినపుడు ఇక్కడ ఎండాకాలం ఉందనేది గమనార్హం. సాధారణంగా వేసవిలో వైరస్‌ కొంత బలహీనంగా ఉంటుంది. ఇంకా మనం చలికాలంలోకి అడుగుపెట్టలేదు. ఉష్ణోగ్రతలు తగ్గడం మొదలయ్యాక వైరస్‌ స్వభావం ఎలా ఉంటుందనేది కీలకం కానుంది. భారీవర్షాలు, వరదల అనంతరం డెంగీ, టైఫాయిడ్‌ కేసులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు చలికాలంలో సాధారణంగానే ఇన్‌ఫ్లూయెంజా ఇన్‌ఫెక్షన్లు పెరుగుతాయి. ప్రస్తుత కోవిడ్‌ పరిస్థితులకు ఇవి కూడా తోడైతే సమస్య జఠిలమయ్యే ప్రమాదముంది. కోవిడ్‌ వ్యాధిని ఇన్‌ఫ్లూయెంజా మరింత సంక్లిష్టంగా మారుస్తుంది. అందువల్ల ఫ్లూకు సంబంధించిన వ్యాక్సిన్‌ వేయించుకుంటే ముందు జాగ్రత్తగా ఉపయోగపడుతుంది.

Flash...   AP AHD : ఏపీ- రాయలసీమ జిల్లాల్లో 1035 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి

మరింత అప్రమత్తత అవసరం

పండుగల సీజన్‌లో ప్రజలు పెద్దసంఖ్యలో బయటకు వస్తున్నారు. కలుసుకోవడం, గుంపులుగా చేరడం పెరిగినందున ఇప్పుడు అప్రమత్తత అవసరం. ఇంకా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానందున జాగ్రత్తలు ముఖ్యం. కొందరు కరోనా అధ్యాయం ముగిసిందనే భావనలో మాస్క్‌లు ధరించడం లేదు. సామాజిక దూరం, శానిటైజేషన్‌ లాంటి జాగ్రత్తలు పాటించడం మానేశారు. దీనివల్ల మళ్లీ కరోనా వైరస్‌ వ్యాప్తి పెరిగే ›ప్రమాదముంది. పండుగల సందర్భంగా పెద్దసంఖ్యలో ఒకచోట గుమికూడటం, చిన్న గుంపులుగా ఒక దగ్గర చేరడం చేయొద్దు. ఇవే కొత్త హాట్‌స్పాట్‌లుగా మారాయనే విషయాన్ని గ్రహించాలి. ఇళ్లచుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. వర్షాలు తగ్గాక అక్కడక్కడా డెంగీ కేసులు రిపోర్ట్‌ అవుతున్నాయి. దీనిపట్ల మరింత అప్రమత్తత, జాగురూకత అవసరం.  

ఇంగ్లండ్‌లో

న్యూఢిల్లీ : ‘ఇంగ్లండ్‌లో కరోనా వైరస్‌ మహమ్మారి రెండో దశ విజంభణ కొనసాగుతోంది. ప్రస్తుతం రోజుకు లక్ష కేసులు కొత్తగా నమోదవుతుండగా, ప్రతి తొమ్మిది రోజులకు ఈ సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. ఈ లెక్కన వచ్చే వారానికి రోజుకు రెండు లక్షల చొప్పున కరోనా వైరస్‌ కొత్త కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. రెండో దశలో కరోనా వైరస్‌ బారిన పడి కనీసం 85 వేల మంది మరణించే అవకాశం ఉంది. రెండో దశ కరోనాను కట్టడి చేయడం కోసం మొదటి దశకన్నా పగడ్బంధీగా ‘లాక్‌డౌన్‌’ ఆంక్షలను అమలు చేయాల్సి ఉంది’ అంటూ కరోనా విజంభణపై నియమించిన సేజ్‌ కమిటీ గత రాత్రి ఇంగ్లండ్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించింది.

లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజీ పరిశోధకులతో కూడిన సేజ్‌ కమిటీ అక్టోబర్‌ 16వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా మహమ్మారి రెండో దశ విజంభణ ప్రారంభమైనట్లు తెల్సింది. మరో దఫా ‘లాక్‌డౌన్‌’గానీ, ఆంక్షలనుగానీ విధించాలని దేశ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌పై శాస్త్రవేత్తల ఒత్తిడి పెరిగింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెల చివరి నాటికి మతుల సంఖ్య కూడా గణనీయంగా పెరగుతుందని, రోజుకు 800 మంది చొప్పున మరణించే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరించారు. కరోనా వైరస్‌ మొదటి దశ విజంభణలో దాదాపు 40 వేల మంది మరణించారు. రెండు దశలో దాదాపు 85 వేల మంది మరణించే అవకాశం ఉందని పరిశోధకులు అంచనా వేశారు. అంటే, రెండింతలకుపైగా. దేశవ్యాప్తంగా 86 వేల మంది శాంపిల్స్‌ను పరిశీలించడం ద్వారా వైరస్‌ రెండో దశ కొనసాగుతున్నట్లు వారు నిర్ధారణకు వచ్చారు.

Flash...   మీ ఇంటికి ఉచిత కరెంట్ పైగా నెలనెలా సంపాదన కూడా.. ఎలా అప్లై చేసుకోవాలంటే..