నిలిచిన SBI ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సేవలు

దిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ సంస్థ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)
ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సేవలు నిలిచిపోయాయి. ఆన్‌లైన్‌ ద్వారా నగదు బదిలీలు
కాకపోవడంతో చాలా మంది కస్టమర్లు ఇబ్బంది పడుతున్నారు. యోనో యాప్‌ కూడా
పనిచేయట్లేదు. కాగా.. కనెక్టివిటీలో లోపం కారణంగా సేవలకు అంతరాయం కలిగిందని
ఎస్‌బీఐ ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. 

‘కోర్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థలో కనెక్టివిటీ సమస్య తలెత్తింది. దీంతో ఆన్‌లైన్‌
సేవలు నిలిచిపోయాయి. ఏటీఎం, పాయింట్‌ ఆఫ్‌ సేల్స్‌ మెషీన్లు మినహా అన్ని ఛానళ్లు
ఆగిపోయాయి. అంతరాయానికి చింతిస్తున్నాం. త్వరలోనే సేవలను పునరుద్ధరిస్తాం. ఇలాంటి
సమయంలో కస్టమర్లు అండగా నిలవాలని కోరుకుంటున్నాం’ అని ఎస్బీఐ ట్వీటర్‌లో
పేర్కొంది

Flash...   Baba Vanga Predictions 2022: 2022 ఇంకా భయంకరం గా ఉండబోతుంది...