సంక్రాంతి సెలవులు 3 రోజులకు తగ్గింపు
రెండో శనివారాలు కూడా పనిదినాలే
సిలబస్ యథాతథం
కొన్ని పాఠాలు తగ్గింపు
ఒక సమ్మేటివ్,రెండు ఫార్మేటివ్ పరీక్షలు
ఏప్రిల్‌లో పది పరీక్షలు
ఎస్‌సీఈఆర్‌టీ కసరత్తు.
అమరావతి-ఆంధ్రజ్యోతి
రాష్ట్రంలోని పాఠశాలలు నవంబరు 2 నుంచి తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో 2020-21
విద్యా సంవత్సరం అకడమిక్ క్యాలెండర్ రూపకల్పనపై రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ
మండలి(ఎస్‌సీఈఆర్‌టీ) కసరత్తు చేస్తోంది. కొవిడ్ కారణంగా బడులు తెరవడం ఇప్పటికే
దాదాపు నాలుగున్నర నెలలు ఆలస్యమైంది. అయినా విద్యార్థులు నష్టపోకుండా, జీరో ఇయర్
లేకుండా ప్ర త్యామ్నాయ అకడమిక్ క్యాలెండర్‌ను రూపొందిస్తోంది
వచ్చేనెల 2 నుంచి ఏప్రిల్ 30వరకు పాఠశాలలు నిర్వహించడం ద్వారా ఈ విద్యా
సంవత్సరంలో 140 పనిదినాలు మాత్రమే వస్తాయని అధికారులు తేల్చారు. దీనికోసం సం
క్రాంతి, క్రిస్మస్ సెలవులను గణనీయంగా తగ్గించనున్నారు. గతంలో 10 రోజులున్న
వీటిని 3 రోజులకు తగ్గించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. ఒకవేళ దీనిపై
పునరాలోచన చేస్తే 5 రోజుల వరకు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈసారి రెండో
శనివారాలను కూడా పనిదినాలుగా మారుస్తున్నారు.
ఇక, 1- 9వ తరగతి వరకు సిలబ్‌సను తగ్గించకుండా కొన్ని పాఠాలను కుదించడంపై
అధికారులు కసరత్తు చేస్తున్నారు. తరగతిలో ఉపాధ్యాయుడు బోధించాల్సిన పాఠాలు,
విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా, సొంతంగా నేర్చుకునే పాఠాలుగా మొత్తం సిలబ్‌సను
విభజిస్తారు. గతంలో ఏటా 2 సమ్మేటివ్ అసె్‌సమెంట్(ఎ్‌సఏ), 4 ఫార్మేటివ్
అసె్‌సమెంట్(ఎ్‌ఫఏ) పరీక్షలను నిర్వహించేవారు
కానీ ఈ సంవత్సరం ఒక సమ్మేటివ్, 2 ఫార్మేటివ్ పరీక్షలు మాత్రమే నిర్వహించాలని
నిర్ణయించారు. జనవరి మొదటి వారంలో ఎఫ్‌ఏ-1, మార్చిలో ఎఫ్‌ఏ-2, ఏప్రిల్‌లో ఎస్‌ఏ
పరీక్షను నిర్వహించాలని ప్రణాళిక రూపొందించారు. ఇక పదో తరగతి విద్యార్థులకు
మాత్రం రెగ్యులర్‌గానే తరగతులు నిర్వహించాలని భావిస్తున్నారు. ఈసారి టెన్త్
పరీక్షలు ఏప్రిల్ 3/4 వారంలో నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం