Amazon One: Palm scanner launched for ‘secure’ payments

గ్లోబల్ దిగ్గజ ఈకామర్స్ సంస్థ అమెజాన్ తాజాగా ప్రపంచాన్ని ఆశ్చర్యానికి
గురిచేసింది. మునుపెన్నడూలేని విధంగా కొత్త పేమెంట్ వ్యవస్థను ఆవిష్కరించింది.
అమెజాన్ తాజాగా బయోమెట్రిక్ పేమెంట్ సిస్టమ్‌ను తీసుకువచ్చింది. దీని పేరు
అమెజాన్ వన్. ఈ విధానంలో ఒక ప్రత్యేకత ఉంది.

సాధారణంగా ఎవరికైనా డబ్బులు పంపించాలన్నా లేదంటే షాపుల్లో బిల్లు కట్టాలన్నా
క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు వంటివి కావాలి. ఇవి కూడా కాకపోతే నెట్
బ్యాంకింగ్ సాయంతో లావాదేవీలు పూర్తి చేయొచ్చు. ఇప్పుడు గూగుల్ పే, ఫోన్‌పే,
పేటీఎం, భీమ్ వంటి వాటితో కూడా ట్రాన్సాక్షన్లు చేయొచ్చు.

అయితే అమెజాన్ వన్ పేమెంట్ సిస్టమ్‌లో వీటన్నింటితో పని లేదు. కేవలం మీ
అరచేతితోనే లావాదేవీలను పూర్తి చేయొచ్చు. ఇది పూర్తిగా కాంటాక్ట్‌లెస్. అమెజాన్
వైస్ ప్రెసిడెంట్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ.. కార్డు లేకుండానే షాపింగ్ చేయొచ్చని
తెలిపారు. ఎలాంటి ప్రొడక్ట్‌ను అయినా కొనుగోలు చేయొచ్చని పేర్కొన్నారు.

అమెజాన్ కొత్త పేమెంట్ సిస్టమ్‌పై కస్టమర్ల ఫీడ్ బ్యాక్‌ను కూడా తీసుకుంటోంది.
అమెజాన్ రానున్న రోజుల్లో మరి కొన్ని స్టోర్లలో ఈ పేమెంట్ వ్యవస్థను అందుబాటులోకి
తీసుకురానుంది. అంతేకాకుండా అమెజాన్ తన గేట్ పాస్‌లను కూడా ఈ విధంగానే
అందిస్తోంది. ప్రస్తుతం అమెరికాలో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. కాగా గతంలో అలి పే
అనే కంపెనీ స్మైల్ టు పే పేమెంట్ సిస్టమ్‌ను తీసుకువచ్చింది. ఇందులో ఫేస్ టు ఫేస్
ద్వారా డబ్బులు చెల్లించేవారు.

Flash...   Twitter New Feature: ట్విట్టర్‌లో tiktok లాంటి కొత్త ఫీచర్