Child care leave for male employees

కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు

 పూర్తి జీతంతో తొలి 365 రోజులు సెలవులు

 80 శాతం వేతనంతో మరో 365 రోజులు లీవు

 న్యూఢిల్లీ,  

 కేంద్రప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నది.

 కేంద్రప్రభుత్వ పురుష ఉద్యోగులకు కూడా ఇక నుంచి శిశు సంరక్షణ సెలవులు ఇవ్వనున్నట్టు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయమంత్రి జితేంద్రసింగ్‌ సోమవారం ప్రకటించారు.

పెండ్లి కానివారు, పెండ్లి అయ్యి భార్య చనిపోయినవారు, విడాకులు తీసుకున్నవారు.. సింగిల్‌ పేరెంట్‌గా తమ బిడ్డల ఆలనాపాలనా తప్పనిసరిగా చూడాల్సిన బాధ్యత ఉన్నవారికి ఈ సదుపాయం కల్పిస్తున్నట్టు తెలిపారు.

దీని ప్రకారం సింగిల్‌ పేరెంట్‌ పురుష ఉద్యోగులకు మొదటి 365 రోజుల సెలవులకు పూర్తి వేతనం చెల్లిస్తారు.

మలిదఫా 365 రోజుల సెలవులకు 80 శాతం వేతనం ఇస్తారు.

 శిశు సంరక్షణ సెలవులో ఉన్నప్పటికీ సాధారణ సమయంలో ఉద్యోగులకు లభించే పర్యాటక సెలవుల (ఎల్టీసీ) ప్రయోజనాలు కూడా పొందవచ్చని మంత్రి తెలిపారు.

మరోవైపు, శారీరక, మానసిక వైకల్యం ఉన్న పిల్లలకు 22 ఏండ్లు వచ్చేవరకు మాత్రమే అవసరమైన సమయంలో వారి సంరక్షకులు శిశు సంరక్షణ సెలవులు పెట్టుకొనేందుకు ప్రస్తుతం వీలున్నది.

✰ అయితే ఈ వయో పరిమితి నిబంధనను ఎత్తేస్తున్నట్టు కూడా మంత్రి పేర్కొన్నారు

Flash...   SALT SURVEY GOOGLE FORMS FOR ALL TEACHERS