CPS Missing credits details requested

Missing credits details of CPS subscribers for the period of before bifurcation i.e. from 01.09.2004 to 02.06.2014 – Details requested . 

The above details are to be forwarded this office through  hard copies to duplicate as well as soft copy before 31.11.2020. without fail.

సిపియస్ ఉద్యోగుల మిస్సింగ్ క్రెడిట్స్ వెంటనే పంపాలి

వన్ టైం సెటిల్మెంట్ సద్వినియోగం చేసుకోండి.

రాష్ట్రంలో పనిచేసే సిపిఎస్ ఉద్యోగుల మిస్సింగ్ క్రెడిట్ ను నవంబర్ 30వ తేదీ లోపు గా జీతాల చెల్లింపు శాఖాధికారులు విజయవాడ పే అండ్ అకౌంట్స్ కార్యాలయానికి పంపాల్సిందిగా ఇబ్రహీంపట్నం పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్ ఉత్తర్వులు జారీ చేశారు.

రాష్ట్రంలో నూతన పెన్షన్ విధానం 1.9.2004 నుండి ప్రారంభమై నందున ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం 1.9 .2004 నుండి 2.6.2014 వరకు సిపియస్ ఉద్యోగుల పని చేసిన స్థానాల్లో ఏవైనా మిస్సింగ్ క్రెడిట్స్ ఉంటే పంపవలసిందిగా జీతాల చెల్లింపు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

 ఒకవేళ ఆ ఉద్యోగి ఒక స్థానం నుండి వేరే స్థానానికి బదిలీ అయినా పదోన్నతి పొందినా డిప్యూటేషన్ మీద వెళ్లినప్పటికీ ఆయా ఉద్యోగుల మిస్సింగ్ క్రెడిట్స్ బాధ్యత డి డి ఓ లదే అన్నారు

ఈ పది సంవత్సరాల్లో ఎటువంటి మిస్సింగ్ క్రెడిట్ సిపిఎస్ ఉద్యోగులకు లేనిపక్షంలో డి డి ఓ లు నో మిస్సింగ్ క్రెడిట్ అని ధ్రువ పత్రం ఇవ్వాలన్నారు.

ఇది వన్ టైం సెటిల్మెంట్ అని నవంబర్ 30వ తేదీ లోపల జతపరచిన ప్రొఫార్మా లో ఇవ్వకపోయిన ఎడల తర్వాత ఎటువంటి ఫిర్యాదులు స్వీకరించబడవన్నారు.

 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయిన నేపథ్యంలో సీపీస్ ఖాతాల్లో సొమ్ము ప్రాన్ అకౌంట్ కి జమ చేయవలసి ఉన్నందున జీతాల చెల్లింపు అధికారులు ఈ విషయంలో తగు బాధ్యత వహించి చర్యలు తీసుకోవాలని పే అండ్ ఎకౌంట్స్ ఆఫీసర్ విజ్ఞప్తి చేశారు.

Flash...   PRC NEWS: సమ్మె కైనా.. ఎస్మా కైనా.. సై

Download Proceedings || Format