నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (యూజీ) 2020 ఫలితాలు
కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి

దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ
కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) 2020 ఫలితాలు కొద్దిసేపటి క్రితం
విడుదలయ్యాయి. నీట్ ఫలితాలతో పాటు అన్ని సెట్లు (E1- E6, F1- F6, G1-G6,
H1-H6) కు సంబంధించిన ప్రొవిజనల్ ఆన్సర్ కీ ని కూడా విడుదల చేశారు. అయితే..
పరీక్ష రాసిన అభ్యర్థులు ఫలితాలను ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్
http://ntaneet.nic.in/ లేదా
https://nta.ac.in/ లో చెక్
చేసుకోవచ్చు.
ఫలితాల కోసం డైరెక్ట్ లింక్:
https://ntaneet.nic.in/ntaneet/online/CandidateLogin.aspx
వైద్య విద్యలో ప్రవేశాల కోసం దేశ వ్యాప్తంగా సెప్టెంబర్ 13 న నీట్ పరీక్ష
జరగిన విషయం తెలిసిందే. కరోనా నిబంధనలు పాటిస్తూ.. కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఈ పరీక్షను నిర్వహించింది. దేశవ్యాప్తంగా
దాదాపు 13 లక్షల మంది ఈ పరీక్షకు హాజరయ్యారు. నీట్-2020 ఫలితాల ఆధారంగా
ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, బీవీఎస్‌సీ, ఏహెచ్ కోర్సుల్లో ప్రవేశాలు
లభిస్తాయి.
ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి:
STEP 1: Visit the official website
STEP 2: Click on the link for NEET result
STEP 3: Enter roll number, date of birth and submit
STEP 4: Results will appear on the screen
STEP 5: Download it, and take a print out for future reference.
Link to check Results
Direct link