NISHTHA శిక్షణ అవగాహన కొరకు

06.10.2020 నుండి జరిగే నిష్టా శిక్షణ లో దీక్షా యాప్ ద్వారా 1 నుండి 8 వ తరగతి వరకు బోధించే  ప్రతి ఉపాధ్యాయుడు పాల్గోనాలి.

దీనికోసం ప్రతి ఉపాద్యాయుడు దీక్ష App డౌన్లోడ్ చేసుకుని వారి పేరు మీద ఒక అకౌంట్  (platform) కలిగి ఉండాలి. 

Also Read: How to register in Diksha App for NISHTHA training 

User name , Passwords  గుర్తు పెట్టుకొండి. వీటి ద్వారా మాత్రమే ప్రతిసారి లాగిన్ అవ్వాలి.

ప్రతి ఐదు రోజులకు ఒక మాడ్యూల్ చొప్పున మొత్తం 18 మాడ్యూల్స్ పై శిక్షణ ఉంటుంది. 

మొత్తం 18*5=90 రోజుల కార్యక్రమం ఉంటుంది

ఉదాహరణకు మొదటి మాడ్యూల్ అక్టోబర్ 6 నుండి 10 వరకు

రెండవది 11 నుండి 15 వరకు

ఈవిధంగా దాదాపు మూడు నెలలు శిక్షణ ఉంటుంది. 

ప్రతి మాడ్యూల్ కి 5రోజుల సమయం కేటాయించటo  జరుగుతుంది.

ఈ 5 రోజులలో 

మొదటి రోజు:- మాడ్యూల్ అధ్యయనం/దానికి సంబంధించిన వీడియోలు చూడటం

రెండవ రోజు:- యూట్యూబ్ లో live class 6 pm to 7 pm ఉంటుంది మీ సందేహాలను విషయ నిపుణుల ను అడగవచ్చు

మూడవ రోజు:- మాడ్యూల్ అధ్యయనం/సంబంధిత వీడియోలు చూడటం

నాల్గవ రోజు:- మీరు ఎంపిక చేసుకున్న కృత్యం తయారీ మరియు సబ్మిట్ చేయాలి.

ఐదవరోజు:- మీరు తయారు చేసిన అస్సెస్మెంట్ సబ్మిట్ చేయాలి.

దీక్షా యాప్ నందు ఎప్పటికప్పుడు  మాడ్యూల్ నందు మీ యొక్క ప్రోగ్రెస్ శాతం ను గమనించుకోవచ్చు

ప్రతి జిల్లాకి ఒక స్టేట్ రిసోర్స్ గ్రూప్ (SRG) ఉంటుంది.

ప్రతి జిల్లాకి ఒక వాట్సాప్/టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది.

వాటి ద్వారా మీకు రిసోర్స్ పర్సన్స్ అందుబాటులో ఉంటారు.

శిక్షణ లో అన్ని అంశాలు పూర్తి చేసిన వారికి సర్టిఫికేట్ ప్రధానం చేయబడును. 

ఈ కార్యక్రమాన్ని DEO గారు, SSA AMO’S,  డైట్ అధ్యాపకులు,  యస్.ఆర్.జీలు పర్యవేక్షిస్తారు. డైట్ ప్రిన్సిపాల్ నోడల్ ఆఫీసర్ గా వ్యవహరిస్తారు.

Flash...   మల్టీజోన్‌ పోస్టుగా జడ్పీ హెచ్‌. ఎం: TS