ఉద్యోగులకు వడ్డీ ఇవ్వాలా?!

ఉద్యోగులకు వడ్డీపై సుప్రీంకు ఆర్థిక శాఖ? 

నామోషీగా భావిస్తున్న రాష్ట్ర ఆర్థిక శాఖ

11లోగా బకాయిలు చెల్లించాలన్న హైకోర్టు 

ధర్మాసనం ఆదేశాలపై సుప్రీంకు వెళ్లే యోచన

అమరావతి, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన బకాయిలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలుకు ఆర్థికశాఖ సుముఖంగా లేదు. కరోనా లాక్‌డౌన్‌ సమయలో ఆదాయాలు తగ్గిపోయాయంటూ ఉద్యోగులు, పెన్షన్‌దారులకు 2నెలల పాటు సగం జీతాలు, సగం పెన్షన్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఉద్యోగులు కోర్టును ఆశ్రయించడంతో 12శాతం వడ్డీతో కలిపి ఈ నెల 11లోగా బకాయిలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. అయితే ఉద్యోగులకు వడ్డీ చెల్లించడాన్ని నామోషీగా భావిస్తున్న ఆర్థిక శాఖ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

Flash...   ఉద్యోగ సంఘాల్లో YCP మార్క్ విభజన !