నాడు-నేడు పాఠశాలలకు రంగులు వేసే ప్రక్రియకు జారీచేసిన మార్గదర్శకాలు.

ముఖ్యకార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ మరియు అడ్వైజర్ ఇన్ఫ్రా వారు మనబడి నాడు-నేడు పాఠశాలలకు రంగులు వేసే ప్రక్రియకు సంబంధించి, 30-09-2020 న నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జారీచేసిన మార్గదర్శకాలు.

1)ప్రధానోపాధ్యాయులు తమ తమ పాఠశాలల్లోని గోడలకు ప్లాస్టరింగ్ అయిన 21 రోజులకు సదరు గోడలకు రంగులు వేయుటకు HM APP లో ఖచ్చితంగా సంసిద్ధతను తెలపాలి.

 బాధ్యులు : ప్రధానోపాధ్యాయులు 

——————–

2)  పాఠశాల ప్రధానోపాధ్యాయునికి బెర్జర్ కంపెనీ ప్రతినిధి ఫోన్ చేయగానే వారి సంసిద్ధత సమాచారాన్ని తెలియజేయాలి.

 బాధ్యులు : ప్రధానోపాధ్యాయులు 

————————-

3) పైంటింగ్ సామగ్రి, రసీదు మరియు డెలివరీ చలానాను బెర్జర్ కంపెనీవారు ప్రధానోపాధ్యాయునికి అందజేసిన వెంటనే వచ్చిన సామగ్రి ని క్షుణ్ణంగా పరిశీలించుకొని స్టాక్ రిజిస్టర్ లో నమోదుచేసి తక్షణమే సదరు చలనా మరియు రసీదులను HM APP లో నమోదు చేయాలి.

 బాధ్యులు : ప్రధానోపాధ్యాయులు 

———————-

4) బెర్జర్ కంపెనీవారు పాఠశాలకు వచ్చి కొలతలు తీసుకునే సమయంలో  పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు పిసి సభ్యులలో ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉండి తీరాలి.

ఏ రోజు వచ్చారు, ఎంత మంది వచ్చారు.. ఎంత సేపు కొలతలు తీశారు మొదలగు విషయాలు సంబంధిత ఫొటోలు అన్నీ ఫైల్ చేయాలి.

బాధ్యులు  ప్రధానోపాధ్యాయులు మరియు పిసి సభ్యులలో ఒకరు

————————

5) బెర్జర్ కంపెనీ నుంచి వచ్చిన పైంటింగ్ మెటీరియల్ను పాఠశాలలో సురక్షితమైన గదిలో తాళాలు వేసి జాగ్రత్తగా భద్రపరచాలి.

 బాధ్యులు : ప్రధానోపాధ్యాయులు 

—————————

6)  అవసరమైతే ఒక మండలం మొత్తం నాడు-నేడు పాఠశాలల పైంటింగ్ మెటీరియల్ను మండల కేంద్రంలోని ఒక పెద్ద పాఠశాలలో సురక్షితమైన గదుల్లో తాళాలు వేసి జాగ్రత్తగా భద్రపరచాలి.

 బాధ్యులు : మండల విద్యాశాఖాధికారి

———————-

7) ఉపరితలాల పరిశుభ్రం…… 

 లోపల  ఉపరితలాలను చేతితో పెట్టుకునే విద్యుత్ మరియు  వ్యాక్యుమైజడ్ మిషన్ తో నునుపు చేయాలి.

వెలుపల ఉపరితలాలను జెట్ వాషింగ్ మిషన్ / హ్యాండ్ స్కేరేపింగ్ / వైర్ బ్రష్ లతో ఎక్కడ ఏ పరికరం అవసరం అయితే దానితో నునుపు చేయాలి. 

Flash...   11వ వేతన సవరణ సంఘము (PRC) - అమలు తీరు ప్రశ్నావళి రూపంలో ఒక సమీక్ష CVS MANI PRTU

గోడల మీద ఐదు మిల్లీమీటర్ల మందం ఉన్న ప్రతీ బీటను బెర్జర్ పుట్టీ పేస్ట్ తో పూరించాలి. 

పాఠశాలలోని  గోడలకు వెలుపల మరియు బయట వేసే రంగులన్నీ ఆటో రోలర్ కమ్ స్ప్రేయింగ్ మిషన్ తోను మరియు హ్యాండ్ రోలర్ మరియు బ్రష్ లతోనూ వేయాలి. 

 బాధ్యులు :బెర్జర్ కంపెనీ ప్రతినిధులు 

—————————–

8) రంగులు వేసే ప్రక్రియ పూర్తి అయ్యాక అన్నీ జాగ్రత్తగా పరిశీలించుకొని పాఠశాల ప్రధానోపాధ్యాయులు వర్క్ కంప్లీషన్ షీట్ మీద సంతకం చేసి అదే కాపీని HM APP లో నమోదు చేయాలి.

బాధ్యులు ప్రధానోపాధ్యాయులు.

————————

9) బెర్జర్ కంపెనీవారు మెజర్మెంట్ షీట్ తో ఇన్వాయిస్ సమర్పిస్తారు. వారికి  ప్రారంభంలో ఉన్న తలుపులు మరియు కిటీకీల మినహాయింపులకు స్పెసిఫీకేషన్స్ అందజేయబడతాయి.

————————

10) ప్రధానోపాధ్యాయులు బెర్జర్ పైంటింగ్స్ ఇన్వాయిస్ షీట్ న APP లో నమోదుచేసి, ఆ మెజర్మెంట్ షీట్ ను ఫీల్డ్ ఇంజినీర్ కు సమర్పించాలి. 

సదరు ఫీల్డ్ ఇంజినీర్ తదుపరి అనుమతి కొరకు వారం రోజులలోపు తన పోర్టల్లో అప్లోడ్ చేయాలి.

—————–

11) నాడు-నేడు పోర్టల్లో నమోదైన క్వాంటిటీతో సంబంధంలేకుండా అనగా ఇండెంట్ డబ్బులు అవేవాటితో సంబంధం లేకుండా మొత్తం పాఠశాలకు అంతా రంగులు వేయాలి.

బాధ్యులు : బెర్జర్ కంపెనీవారు

————————–

12) రంగులు వేసే సమయంలో తరగతి గదులన్నీ, ప్రాథమిక పాఠశాలలకైతే  ఏడు రోజుల వరకు ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలలకైతే పదిహేను రోజులు ఖాళీ చేసి ఉంచాలి

 బాధ్యులు : ప్రధానోపాధ్యాయులు 

————————-

13) ప్రధానోపాధ్యాయులు బెర్జర్ పైంటింగ్స్ ఇన్వాయిస్ షీట్ ను ఆప్ లో నమోదుచేసి, ఆ మెజర్మెంట్ షీట్ ను ఫీల్డ్ ఇంజినీర్ కు సమర్పించాలి. సదరు ఫీల్డ్ ఇంజినీర్ తదుపరి అనుమతి కొరకు వారం రోజులలోపు తన పోర్టల్లో అప్లోడ్ చేయాలి.

బాధ్యులు : ఫీల్డ్ ఇంజినీర్

————————————-

14) నాడు-నేడు పోర్టల్లో నమోదైన క్వాంటిటీతో సంబంధంలేకుండా అనగా ఇండెంట్ డబ్బులు అవేవాటితో సంబంధం లేకుండా మొత్తం పాఠశాలకు అంతా రంగులు వేయాలి.

Flash...   Constitution of State Level Committee for Death Audit on COVID-19

——————————–

15)  రంగులు వేసే సమయంలో తరగతి గదులన్నీ, ప్రాథమిక పాఠశాలలకైతే  ఏడు రోజుల వరకు ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలలకైతే పదిహేను రోజులు ఖాళీ చేసి ఉంచాలి

 బాధ్యులు : పాఠశాల ప్రధానోపాధ్యాయులు

———————————

16) చిత్రాలు వేయడానికి కొలతలు తీసుకునే విధానం…. 

* ముగ్గులకు 100 శాతం ప్రదేశాన్ని (పొడవు × వెడల్పు /ఎత్తు) లెక్కించాలి.

* బయటవేసే చిత్రాలు అరవై శాతం జాగాలోను…

* లోపల వేసే చిత్రాలు నలభై శాతం జాగాలోను వేయాలి.

కొన్ని చోట్ల వేసే ముఖ్యమైన పైంటింగ్స్ కు 100%  జాగాను లెక్కించాలి. 

———————–

17) బయటవైపు ప్రహరీ గోడలపై  స్టెన్సిల్స్ తో వేసే రంగులన్నీ  రహదారి పై నుంచి మరియు భవనాల పై నుంచి కనబడే విధంగాను ప్రహారీగోడల లోపల వేసే రంగులన్నీ గేటు వద్ద నుంచి కనబడేలా వేయాలి.

 బాధ్యులు : బెర్జర్ పైంటింగ్స్ ప్రతినిధులు

————————————

18) మనబడి నాడు-నేడు పాఠశాలల్లో పనిచేస్తున్న డ్రాయింగ్ టీచర్లు ఎవరైనా చిత్రాలను వేయదలచుకుంటే వారికి బెర్జర్ కంపెనీవారు పైంటింగ్ మెటీరియల్ ఇస్తారు మరియు ఆర్ట్ వేసిన ప్రదేశాన్ని లెక్కగట్టి సదరు ఇన్వాయిస్ ను అప్లోడ్ చేస్తారు.

19)పైంటింగ్ పని పూర్తి అయ్యాక ఖాళీ  పైంట్ డబ్బాలను పాఠశాలలోనే పొందుపరచాలి… అదనంగా ఉంటే కేవలం పదిశాతం సామగ్రిని మాత్రమే కంపెనీ వారు వారితో తీసుకు వెళ్ళాలి