పీఆర్సీకి మోక్షం కలిగేనా?

 సీఎస్‌కు చేరిన 11వ పీఆర్సీ నివేదిక

ఆరు వాయిదాల తర్వాత సమర్పణ

ఫిట్‌మెంట్‌పై ఉద్యోగుల ఆశలు నెరవేరేనా?

55% ఫిట్‌మెంట్‌ కోరిన ఉద్యోగ సంఘాలు

10వ పీఆర్సీలో 43% రికార్డు ఫిట్‌మెంట్‌

తొలిసారి 10 నెలల బకాయిల చెల్లింపులు

  27 నెలల బకాయిలు సర్కారు చెల్లించేనా?

రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ సంఘాల్లో తర్జనభర్జ

పదకొండవ పీఆర్సీకి మోక్షం కలుగుతుందా? తాము కోరుకున్న విధం గా ఫిట్‌మెంట్‌ ఉంటుందా? రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఈ అంశాలపైనే చర్చించుకుంటున్నారు. ఆరు వాయిదాల అనంతరం పీఆర్సీ కమిషన్‌ చైర్మన్‌ అశుతోశ్‌ మిశ్రా సోమవారం పీఆర్సీ నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎ్‌స)కి అందించారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే ఉద్యోగ వర్గాల్లో ఫిట్‌మెంట్‌పై చర్చ ప్రారంభమైంది. గత ప్రభుత్వం హయాంలో ఉద్యోగులకు 43% ఫిట్‌మెంట్‌ కల్పించారు. అదేసమయంలో ఉద్యోగులకు 10 నెలల బకాయిలు చెల్లించారు. 11వ పీఆర్సీ కోసం చంద్రబాబు ప్రభుత్వమే 2018 మేలో కమిషన్‌ను వేసింది. ఏడాదిలోపు నివేదిక ఇవ్వాల్సి ఉండగా.. ఈ ఏడాది అదనంగా ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ ఇ వ్వాల్సి ఉన్నందున వాయిదాలు వేస్తూ.. వచ్చింది.

*𒊹︎︎︎ డీఏపై ఏం చేస్తారు?*

అప్పటి సీఎం చంద్రబాబు తమకు 43% ఫిట్‌మెంట్‌ ఇచ్చారని, ఇప్పు డు కనీసం 55% ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు పీఆర్సీ కమిషన్‌కు నివేదించాయి. 2018 జూలై నుంచి పీఆర్సీ రావాల్సి ఉందని పేర్కొంటున్నాయి. గత ప్రభుత్వం బకాయిలు చెల్లించడంతో.. ఈ ప్రభుత్వం కూ డా 27 నెలల బకాయిలు చెల్లిస్తుందని ఆశతో ఎదురుచూస్తున్నారు. కాగా, డీఏకు సంబంధించి ఉద్యోగ వర్గాల్లో పలు అనుమానాలున్నాయి. కేం ద్ర ప్రభుత్వం డీఏ చెల్లించేది లేదని చట్టం చేయడంతో అదే బాటలో రా ష్ట్రం నడుస్తుందా? లేకుంటే ఇవ్వాల్సిన 5 డీఏల బకాయిలను చెల్లిస్తుం దా? అనే సందేహంలో ఉన్నారు. కేంద్రం విధానాన్ని అనుసరించినా గతంలో ఇవ్వాల్సిన 3 డీఏల బకాయిలు చెల్లించాల్సి ఉంటుందని ఉద్యోగు లు పేర్కొంటున్నారు. కాగా, కరోనా సమయంలో హఠాత్తుగా నివేదిక ఇవ్వడంపై ఉద్యోగ సంఘాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. కరోనా కార ణం చూపి ఉద్యోగుల ఫిట్‌మెంట్‌లో కోతలుంటాయేమోనని అనుమానిస్తున్నారు. 27 నుంచి 29% వరకు ఫిట్‌మెంట్‌ ఇచ్చి ఉంటారని కొంత మంది ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు. కాగా, ఈసారి 70 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ లభించనుంది. 

Flash...   Re - Counselling (web) to Municipal merging Teachers - certain instructions to AP CFSS

*𒊹︎︎︎ ఎప్పటి నుంచి అమలు?*

పీఆర్సీ అమలుపైనా ఉద్యోగులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. నివేదిక ఇచ్చినా దీనిని సీఎం జగన్‌ యథాతథంగా అంగీకరిస్తారా? ఎప్పటి నుంచి అమలవుతుంది? అనే అంశాలపై వారిలో ఉత్కంఠ నెలకొంది. ఫి ట్‌మెంట్‌ 63ు, కనీస జీతం రూ.25 వేలు, గరిష్ఠంగా రూ.2,15,270, ఇంక్రిమెంట్‌ 3ు, పెన్షన్‌ రూ.6500 నుంచి 12,500కు పెంచాలని రెవె న్యూ సర్వీసెస్‌ అసోషియేషన్‌ సహా పలు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నా యి. అదేసమయంలో సీఆర్‌డీఏ పరధిలో పనిచేసే ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ 30%, కార్పొరేషన్‌ పరిధిలో 25%, ఇతర ప్రాంతాల్లో ఉన్న వారికి 20% ఇవ్వాలని, మట్టి ఖర్చుల కింద గతంలో రూ.15 వేలు ఇచ్చే వారని, దీనిని రూ.50 వేలు, లేదా సదరు ఉద్యోగి ఒక నెల జీతం చెల్లించాలని పీఆర్సీని కోరారు. మరోపక్క, కరోనా కారణంగా మార్చి, ఏప్రిల్‌ నెలలకు సంబంధించి ఉద్యోగుల వేతన బకాయిలు చెల్లింపుపై స్పష్టత రాకపోవడంపైనా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

*𒊹︎︎︎ త్వరగా కొత్త పీఆర్సీ అమలు చేయాలి*

ప్రభుత్వ ఉద్యోగుల 11వ వేతన సవరణ సంఘం(11వపీఆర్సీ) నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి సోమవారం అందజేసిన ట్లు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్‌ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పేరివిజన్‌ కమిషన్‌ చైర్మన్‌ అశుతోశ్‌ మిశ్రా అందజేసిన పీఆర్సీ నివేదికను ప్రభుత్వం పరిశీలించి త్వరితగతిన కొత్త పీఆర్సీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని పేర్కొన్నారు.