ఒకటో తారీఖు జీతాలు రాకపోతే ఊరుకోం

సచివాలయంలో ఆందోళనకు దిగుతాం. 

నెలాఖరు వరకు ఆర్థికశాఖ అధికారులు నిద్రపోయారా 

మంత్రి బుగ్గన విధానాలు మార్చుకోవాలి 

ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కె. ఆర్. సూర్యనారాయణ

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగుల నవంబరు జీతాలు ఇవ్వాలంటే హెచ్ ఆర్ డేటా నమోదు చేయాలని ఆర్థికశాఖ అధికారులు మెలిక పెట్టడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.ఆర్. సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కార్ రావులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నవంబరు 20 వరకు ఈ విషయంలో ఆర్థికశాఖ అధికారులు నిద్రపోయారా అని ఆయన ప్రశ్నించారు. డిసెంబర్ ఒకటి నాటికి ఉద్యోగుల జీతాలు వచ్చే పరిస్థితి లేకపోతే ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ప్రత్యేక కార్యదర్శి ఛాంబర్ల ముందు ఉద్యోగులం ధర్నాకు దిగుతామని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన , వీడియో సందేశం విడుదల చేశారు. 

నవంబరు 20 న ఇలాంటి ఉత్తర్వులు ఇస్తే ఉద్యోగులకు జీతాలు ఎలా అందుతాయని సూర్యనారాయణ ప్రశ్నించారు. ఆర్థికశాఖ అధికారులు వారి వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు, హెచ్ ఆర్ డేటా నమోదు విషయం వేరని, నవంబరు నెల జీతాలు ఇవ్వడం వేరని ఈ రెండూ వేర్వేరు విషయాలుగా చూడాలని పేర్కొన్నారు. ఈ రెండింటి మెలిక తొలగించాలని కోరారు. ఇప్పటికే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగు, రెగ్యులర్ ఉద్యోగుల జీతాలు, పెన్షను ఆలస్యమవుతున్నా యని పేర్కొన్నారు. 

ఆర్ధిక మంత్రి బుగ్గన తన విధానాలు మార్చుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ ప్రభుత్వంపై అందరూ ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని అన్నారు. ఆర్థికశాఖ అధికారులు తమ వైఖరి మార్చుకోవాలని ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురాకపోయినా పర్వాలేదు, చెడ్డపేరు రాకుండా చూసుకోవాలని హితవు పలికారు పెండింగు జీతాలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించినందుకు హర్షం వ్యక్తం చేశారు. తక్షణమే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.

Sourse: http://www.udhyogulu.news/

Flash...   Nobel Prize: నోబెల్ ప్రైజ్ మనీ పెరిగింది.. ఇప్పుడు ఎంత ఇస్తారో తెలుసా..?