కరోనా భయంతోనే 80% మంది బడులకు దూరం

రవాణా, వసతిగృహాలు లేకపోవడంతోనూ తగ్గుతున్న హాజరు

పాఠశాలకు రానివారిలో 85% మందికి ఇంటి వద్దే చదువులు

పాఠశాల విద్యాశాఖ సర్వేలో వెల్లడి

 కరోనా భయంతోనే 80% మంది విద్యార్థులను వారి తల్లిదండ్రులు బడికి పంపించడం లేదని పాఠశాల విద్యాశాఖ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. పాఠశాలలు పునఃప్రారంభమైనా 9, 10 తరగతుల విద్యార్థుల హాజరు తక్కువగా ఉండటంతో దీనిపై అధికారులు సర్వే చేశారు. 

71వేల మంది విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలను సేకరించారు. వీరిలో ఎక్కువమంది కరోనా భయంతోనే పిల్లల్ని బడులకు పంపించేందుకు ఇష్టపడటం లేదని వెల్లడించారు. జడ్పీ పాఠశాలలు కొన్ని గ్రామాలకు దూరంగా ఉండటం, రవాణా సదుపాయం లేకపోవడంతో మరికొందరు బడులకు వెళ్లట్లేదు. రవాణ సదుపాయం కొందరికి చాలా ఇబ్బందిగా ఉంది. వసతిగృహాలను తెరవకపోవడంతో వీటిల్లో ఉండి చదువుకునే వారు ప్రస్తుతం ఇళ్లకే పరిమితం అవుతున్నారు. కొందరు విద్యార్థులు కొవిడ్‌-19 బారిన పడినట్లు సర్వేలో వెల్లడైంది. ఇంటికే పరిమితమవుతున్న వారిలో 85% మంది ఆన్‌లైన్‌, వాట్సప్‌, ఇతర విధానాల్లో విద్యను అభ్యసిస్తున్నారు. కరోనా భయంతోనే బడులకు పంపించకపోవడంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

Flash...   8న మొబైల్స్‌ కొనుగోలుపై 10% రాయితీ