ఈ రోజు నిర్వహించిన వెబెక్స్ వీడియో కాన్ఫరెన్స్ నందు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ వారి సూచనలు:
1. టీచర్లు అందరూ బయోమెట్రిక్ హాజరు వేయాలి. (కోవిడ్-19 నిబంధనలు అనుసరించండి. ప్రతి టీచర్ శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకోవాలి. ఒకరు వేసిన తరువాత ప్రతిసారీ మెషీన్ ను శానిటైజ్ చేయాలి.)
2. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూల్ టీచర్లు అందరు ప్రతిరోజూ పాఠశాలకు హాజరు కావాలి.
3. హైస్కూలులో ఎక్కడైనా టీచర్ల కొరత ఉంటే మండల విద్యా శాఖ అధికారి వారితో సంప్రదించి యు.పి.పాఠశాలలోని టీచర్లను డెప్యూటేషన్ వేయించి విద్యార్థులకు బోధించగలరు.
4. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూల్ టీచర్లు అందరు SOP ప్రకారం అకడమిక్ యాక్టివిటీస్ తయారు చేసుకోవాలి.
5. SOP ప్రకారం అవకాశం ఉన్న చోట 9వ తరగతి విద్యార్ధులు కూడా ప్రతి రోజు పాఠశాలకు హాజరుకావచ్చు