23 నుంచి 8 వ తరగతికి మాత్రమే..పాఠశాల పునః ప్రారంభం షెడ్యూల్ లో మార్పు

 23 నుంచి 8వ తరగతి విద్యార్థులకు తరగతులు. 

అమరావతి..

ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలల పునఃప్రారంభం షెడ్యూల్‌లో ప్రభుత్వం మార్పులు చేసింది. 

ఈ నెల 23 నుంచి ఎనిమిదో తరగతి పిల్లలకు మాత్రమే క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

గత షెడ్యూల్‌ ప్రకారం 23 నుంచి 6,7,8 తరగతులకు క్లాసులు ప్రారంభం కావాల్సి ఉంది

క్రమేణా ఉన్నత పాఠశాలల్లో అన్ని  తరగతులు నిర్వహణకు ఏర్పాట్లు. 

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడి. 

సచివాలయం : ఈనెల 23 సోమవారం నుంచి 8వ తరగతి విద్యార్థులకు కూడా తరగతులు
నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు
సురేష్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇప్పటికే ఈనెల 2 నుంచి 9, 10 తరగతి
విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్న సంగతి విదితమే. విద్యార్థులను పాఠశాలలకు
పంపేందుకు తల్లిదండ్రులు సుముఖంగా ఉండటం తో పాటు హాజరు శాతం పెరుగుతోంది. ఈ
నేపథ్యంలో 8వ తరగతి విద్యార్థులకు కూడా పాఠశాలల్లో తరగతులు నిర్వహించాలని
నిర్ణయించటం జరిగింది.

 8, 9 తరగతుల విద్యార్థులు రోజుమార్చి రోజు పాఠశాలకు హాజరు
కావాల్సి ఉండగా 10 వ తరగతి విద్యార్థులు ప్రతిరోజూ పాఠశాలలకు హాజరు కావాల్సి
ఉంటుంది. ఈ మూడు తరగతుల విద్యార్థులకు బోధన జరుపుతూ డిసెంబర్ 14 నుంచి  6, 7
తరగతి విద్యార్థులకు కూడా తరగతులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని
మంత్రి తెలిపారు. 14వ తేదీ తరువాత అప్పటి పరిస్థితి సమీక్షించుకుని 1-5 తరగతులపై
నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది.  

ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.45
వరకు జరుగుతున్న పాఠశాలలు చలికాలం కారణంగా ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల
వరకు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వటం జరిగిందని మంత్రి సురేష్ తెలిపారు.

Flash...   AP CETS FEE DETAILS AND LAST DATES