Good News for bank customers – RBI

బ్యాంక్ కస్టమర్లకు ఒక ముఖ్యమైన అలర్ట్. డిసెంబర్ నుంచి కొత్త రూల్స్ అమలులోకి
రాబోతున్నాయి. మనీ ట్రాన్సాక్షన్లను సంబంధించి కొత్త నిబంధనలు వస్తున్నాయి. ఈ
విషయాన్ని బ్యాంక్ కస్టమర్లు ముందే తెలుసుకుంటే మంచిది. రిజర్వు బ్యాంక్ ఆఫ్
ఇండియా ఇప్పటికే రియల్ ‌టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (ఆర్టీజీఎస్) సర్వీసులు ప్రతి
రోజూ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. ఈ నిర్ణయం 2020 డిసెంబర్ నుంచి
అమలులోకి రాబోతోంది. ప్రస్తుతం ఆర్‌టీజీఎస్ సేవలు కేవలం ఉదయం 7 గంటల నుంచి
సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

కొత్త రూల్ అమలులోకి వస్తే.. 

బ్యాంక్ కస్టమర్లు ఇక రోజంతా ఎప్పుడైనా డబ్బులు ట్రాన్స్‌ ఫర్ చేయొచ్చు. రిజర్వు
బ్యాంక్ ఆఫ్ ఇండియా గతేడాది నెఫ్ట్ సేవలను రోజంతా అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఇండియన్ ఫైనాన్షియల్ మార్కెట్లను గ్లోబల్ మార్కెట్లకు అనుగుణంగా ఉండేలా ఆర్‌బీఐ ఈ
నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. ఆర్‌టీజీఎస్ ద్వారా కస్టమర్లు ఎక్కువ డబ్బులను
వెంటనే ఇతరులకు పంపొచ్చు. కనీసం రూ.2 లక్షలు పంపాల్సి ఉంటుంది. మీరు ఆన్‌లైన్‌ లో
డబ్బులు పంపితే ఎలాంటి చార్జీలు పడవు. బ్యాంకుకు వెళ్లి డబ్బులు పంపితే మాత్రం
చార్జీలు చెల్లించుకోవాలి. రూ.2 లక్షలకు లోపు డబ్బులు పంపాలంటే నెఫ్ట్ ద్వారా
పంపించుకోవచ్చు.

Flash...   చంద్రుడిపై ప్రత్యేక మూలకం.. 50 గ్రాములతో ఏపీ, తెలంగాణకు నెలపాటూ కరెంటు లభిస్తుంది