Mega Star Chiranjeevi Tested Positive

 మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడ్డారు. `ఆచార్య` సినిమా షూటింగ్‌లో
పాల్గొనబోతున్న సందర్భంగా చేయించుకున్న కోవిడ్ టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలింది. ఈ
విషయాన్ని చిరంజీవి ట్విటర్ ద్వారా వెల్లడించారు. గత 4-5 రోజుల్లో తనను
కలిసినవారందరూ టెస్ట్ చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

“ఆచార్య` షూటింగ్ ప్రారంభించాలని కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్
పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు. వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను. గత
4-5 రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను.
ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాన`ని చిరంజీవి ట్వీట్
చేశారు. మెగాస్టార్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ అభిమానులు ట్వీట్లు
చేస్తున్నారు.

ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని,కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు.వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను.గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను.ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాను. pic.twitter.com/qtU9eCIEwp

— Chiranjeevi Konidela (@KChiruTweets) November 9, 2020

Flash...   Degree courses : ఆంగ్ల మాధ్యమంలో డిగ్రీ కోర్సులు