Re-apportion and – (Regulation of Transfers) Guidelines, 2020- Clarifications 03.11.2020

 Re-apportion and The Andhra Pradesh Teachers (Regulation of
Transfers) Guidelines, 2020- Clarifications – Issued

Memo.No.13029/11/2020-EST 3 Dt:03/11/2020.

Sub: – SE Dept., – Estt III – Re-apportion and The Andhra Pradesh
Teachers (Regulation of Transfers) Guidelines, 2020- Clarifications –
Issued – Reg.

Ref: – 

1.G.O.Ms.No.53 School Education (Ser.II) Dept., dt. 12.10.2020 

2.G.O.Ms.No.54 School Education (Ser.II) Dept., dt. 12.10.2020 

3.This office Proc.Rc.No.13029/11/2020-EST3 dated 14.10.2020 

4.Lr.Rc.No.5391/A1/2020 dt. 2.10.2020 of the DEO, Visakhapatnam 

5.Lr.Rc.No.1435-A4/2020 dated 26.10.2020 of the DEO, East Godavari. 

6.Lr.Rc.No.6077/B1/B2/A3/A5/020 dt. 27.10.2020 of the DEO, Anantapuramu.

The attention of the District Educational Officers, Visakhapatnam, East
Godavari and Anantapuram is invited to the references cited and they are
informed that the following clarifications are issued :

విశాఖపట్నం DEO గారు👇

1) విశాఖపట్నం జిల్లాలో 12 మంది ప్రభుత్వ యాజమాన్య స్కూల్ అసిస్టెంట్ లు DEO పూల్ లో కలరు.వారిని బదిలీలకు ముందే ఖాళీ పోస్టులలో సర్దుబాటు చేయవలెనా? 

క్లారిఫికేషన్ : కాదు… DEO పూల్ లోని సదరు 12 మంది ప్రభుత్వ యాజమాన్య స్కూల్ అసిస్టెంట్ లను బదిలీలు పూర్తి అయిన పిదప… మిగిలిన ఖాళీ పోస్టులలో సర్దుబాటు చేయవలెను

2) ప్రిఫరెన్షియల్ కేటగిరీ క్రింద బదిలీ కొరకు దరఖాస్తు చేయు ఉపాధ్యాయుల యొక్క  మెడికల్ రిపోర్ట్ లు/మెడికల్ సర్టిఫికెట్స్ ఏ తేదీన జారీ చేయబడినవి పరిగణనలోనికి తీసికొనవలెను? 

క్లారిఫికేషన్ : పై సందర్భాలలో బదిలీల జీవో విడుదల అయిన తేది నుండి 6 నెలల ముందుగా జారీ చేయబడిన రిపోర్ట్ లు/సర్టిఫికెట్లు మాత్రమే పరిగణనలోకి తీసుకొనబడును 

తూర్పుగోదావరిDEO గారు👇

1) ఉపాధ్యాయుల రీ అప్పోర్షన్ మెంట్ ప్రక్రియ పూర్తి అయ్యేసరికి… ప్రభుత్వ యాజమాన్యంలో గల స్కూల్ అసిస్టెంట్ లు అధిక సంఖ్యలో సర్ ప్లస్ గా ఉండనున్నందున.. వారిని డెఫిసిట్ గల ZP యాజమాన్య ఉన్నత పాఠశాలల్లో సర్దుబాటు చేయవచ్చా? 

Flash...   Extension of the last date for online applications for APRJC & DC CET 2020

క్లారిఫికేషన్ : లేదు.. ఏ ఏ  యాజమాన్య పాఠశాలల్లో సర్ ప్లస్ గా ఉన్నారో.. ఆయా యాజమాన్యాల డెఫిసిట్ గల పాఠశాలల్లోనే సర్దుబాటు చేయాలి.బదిలీలు ముగిసిన తదుపరి మాత్రమే  వర్క్ అడ్జస్ట్మెంట్ ప్రక్రియ నిర్వహించాలి. 

2) ZP ఉన్నత పాఠశాలల్లో అధిక సంఖ్యలో స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ ల డెఫిసిట్  కలవు మరియు ప్రాధమిక పాఠశాలల్లో అధిక సంఖ్యలో SGT లు సర్ ప్లస్ గా కలరు…..సర్ ప్లస్ SGT లను ఉన్నత పాఠశాలల్లో డెఫిసిట్ గా ఉన్న SA పోస్ట్ లకు against గా షిఫ్ట్ చేయవచ్చా? 

క్లారిఫికేషన్ : అట్లు చేయరాదు.. ప్రాధమిక పాఠశాలల్లో సర్ ప్లస్ గా గల SGT లను అవసరత గల UP పాఠశాలల్లో ఖాళీగా గల స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు against గా షిఫ్ట్ చేయవలెను  మరియు  UP పాఠశాలల్లో సర్ ప్లస్ గా గల స్కూల్ అసిస్టెంట్ లను అవసరత గల ఉన్నత పాఠశాల్లో ఖాళీగా గల స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ లకు against గా షిఫ్ట్ చేయవలెను 

3) ఒక ప్రాధమిక పాఠశాలలో రెండు పోస్టులు కలవు.వానిలో ఇరువురు ఉపాధ్యాయులు పనిచేయుచున్నారు.వారిలో ఒకరు గ్రుడ్డి వారు కాగా మరొకరు 2 సంవత్సరాల లోపు సర్వీస్ కలిగివున్నారు. వారిరువురిలో ఎవరు రేషనలైజేషన్ వలన   effect కాబడతారు.

క్లారిఫికేషన్ : GO MS No.53 ప్రకారం ప్రతి ప్రాధమిక పాఠశాలలో 2 SGT పోస్టులు ఉంచబడతాయి. అందువలన… రీ అప్పోర్షన్ వలన సదరు పాఠశాలలో  ఏ  ఉపాధ్యాయుడూ కూడా కదలరు 

4) కొంతమంది ఉపాధ్యాయుల ప్రభుత్వ బదిలీ ఉత్తర్వుల నిమిత్తం.. వారు బదిలీ కాబడే చోటు ఖాళీగా ఉన్నదనే ధృవీకరణ DSE AP వారికి సమర్పించియున్నాము. అట్టి ఉపాధ్యాయులకు నేటి వరకు ప్రభుత్వ బదిలీ ఉత్తర్వులు రాలేదు. సదరు ఖాళీలను సాధారణ బదిలీల కొరకు ఖాళీగా చూపవలెనా? 

క్లారిఫికేషన్ : అవును.. బదిలీల నిమిత్తం ఖాళీలు ప్రకటించే తేదీ నాటికి సదరు ఉపాధ్యాయులకు ప్రభుత్వ ఉత్తర్వులు రాని యెడల…అప్పుడు అట్టి ఖాళీలను బదిలీల కౌన్సిలింగ్ కొరకు ప్రదర్శించవలెను.

Flash...   Summer Holidays 2021-22 proceedings

అనంతపురం DEO గారు 👇

1) ఒక టీచర్ అనంతపురం జిల్లాలో పనిచేయుచున్నారు.వారి యొక్క spouse కృష్ణా జిల్లాలో ప్రభుత్వోద్యోగిగా ఉన్నారు.అట్టి టీచర్ బదిలీలలో spouse points  వినియోగించుకొనుటకు అర్హులేనా? 

క్లారిఫికేషన్ : అవును 

2) ఒక టీచర్ 2015 లో జరిగిన బదిలీలలో spouse కేటగిరీ క్రింద బదిలీ కాబడ్డారు.వారు  2017 లో  స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతి పొందారు.వారు ప్రస్తుత బదిలీలలో spouse points వియోగించుకొనుటకు అర్హులేనా? 

క్లారిఫికేషన్ : అర్హులు కారు.. 

GO MS No.54 లోని 7(ii) ప్రకారం  దంపతులిరువురిలో కేవలం ఒకరు మాత్రమే గత 5/8 సంవత్సరాలలోspouse points వినియోగించుకోవలెను

Download Clarifications