Transfer Updates as on 15.11.2020

 అతి జరూరు మరియు అతి ముఖ్యం

★ అందరు ప్రధానోపాధ్యాయులు మరియు మండల విద్యాశాఖాధికారులు      ఉపాధ్యాయులందరికి తెలియజేయవలసిన ముఖ్య విషయాలు…

★ 1. బదిలీకి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 16.11.2020. ఈ తేది తరువాత గడువు పొడిగించబడదు.

★ 2. 18.11.2012 కి ముందు జాయిన్ అయిన ఉపాధ్యాయులు మరియు 18.11.2015 కి ముందు జాయిన్ అయిన ప్రధానోపాధ్యాయులు అనగా 8/5 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్నవారు మరియు  రేషనలైజేషన్లో పోస్టు బదిలీ చేయబడిన ఉపాధ్యాయులందరు తప్పనిసరిగా బదిలీకి దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవలెను. 

★ అలా చేసుకోని పక్షంలో, కౌన్సిలింగ్ ముగిసిన తర్వాత.. చివరలో మిగిలిన ఖాళీలలో ఎక్కడపడితే అక్కడ వేస్తారు. వారు ఆప్షన్ కోరుకునే అవకాశాన్ని కోల్పోతారు.

★ 3.  స్పోజ్ కేటగిరీ లో దరఖాస్తు చేసుకునే ఉపాధ్యాయులు ఆప్షన్స్ ను ఇచ్చుకొనేటప్పుడు.. వారి స్పోజ్ కి అతి దగ్గర ఖాళీలను ప్రాధాన్యతా క్రమంలో ఇచ్చుకోవాలి. ఎక్కువ HRA ఉన్న ఖాళీలను ప్రాధాన్యతగా ఇచ్చి అతిదగ్గరగా ఉండే ఖాళీలను తరువాత ప్రాధాన్యత క్రమంలో ఇవ్వరాదు.

4. అందరి దరఖాస్తులను,నిబంధనల మేరకు క్షుణ్నంగా పరిశీలించాలి.

★ ప్రతి DDO బదిలీలకు సంబంధించిన G.O లు,ఎప్పటికప్పుడు వచ్చే వివరణల ప్రతులు ప్రింట్ తీసి పెట్టుకోవాలి.వాటిని అవగాహన చేసుకోవాలి

★ 5.  ప్రిఫరెన్సియల్ కేటగిరీ లో ,..వైద్య కారణాలతో దరఖాస్తు చేసుకునే ఉపాధ్యాయులు కాంపిటెంట్ అథారిటీ/ మెడికల్ బోర్డ్ నుంచి గత 6 నెలలలో తెచ్చుకున్న సర్టిఫికెట్ ని అప్లోడ్ చేయాలి.

★ 6. ప్రిఫరెన్సియల్ కేటగిరీ లేదా స్పోజ్ కేటగిరీ లలో ఎదో ఒకదాన్ని మాత్రమే ఉపయోగించుకోవాలి. ఈ విషయాన్ని జాగ్రత్తగా పరీక్షించాలి.

★ 7. 8/5 సంవత్సరాలు పూర్తి కాకుండానే ఇప్పటి బదిలీల్లో మళ్ళీ 

ప్రిఫరెన్సియల్ కేటగిరీ లేదా స్పోజ్ కేటగిరీ లలో ఎదో ఒకదాన్ని ఏ ఉపాధ్యాయుడు/ ఉపాధ్యాయని/HM ఉపయోగించరాదు.

★ 8. 8/5 సంవత్సరాలు పూర్తి కాకుండానే ఇప్పుడు రేషనలైజేషన్ లో పోస్ట్ షిఫ్ట్ అయ్యుంటే ఆ ఉపాధ్యాయుడు మళ్ళీ ప్రిఫరెన్సియల్ కేటగిరీ లేదా స్పోజ్కే టగిరీ లో ఎదో ఒక దాన్ని ఉపయోగించుకోవచ్చు.

Flash...   Updation of details of SGTs/ School Assistants in Teacher Information System

★ 9. స్కూల్ కేటగిరి విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. తప్పుడు కేటగిరీ లో ఉన్న అప్లికేషన్ని పరిశీలించకుండా అలాగే సబ్మిట్ చెస్తే దానికి పూర్తి బాధ్యత ప్రధానోపాధ్యాడు మరియు మండల విద్యాశాఖాధికారి వహిస్తారు. 

★ 10. Reapportionment exercise  లో షిఫ్ట్ అయిన పోస్టులను ఖచ్చితంగా Reapportion వేకెన్సీ గా చూపించాలి. లేదంటే ఆ పోస్ట్ ఆ పాఠశాలకు రాదు. ఈ విషయాన్ని  HM / MEO అతి జాగ్రత్తగా పరిశీలించుకొని నిర్ధారించుకోవాలి. 

★ 11. ఎలాంటి తప్పుడు సమాచారం ఇచ్చినా దానికి ఆ HM/ MEO దే భాద్యత. మరియు ఆ ఉపాధ్యాయుడి పైన చర్య తీసుకొనబడును.

★ 12. స్కౌట్, NCC, PH,.. మరియు  అన్ని సర్టిఫికెట్స్ ని అతి జాగ్రత్తగా పరిశీలించి సర్టిఫై చేయవలెను.

★ చివరగా తప్పనిసరిగా బదిలీ అయ్యే ఉపాధ్యాయులు మరియు రేషనలైజేషన్ లో పోస్ట్ షిఫ్ట్ అయిన ప్రతి ఉపాధ్యాయుడు ఖచ్చితంగా బదిలీకి దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత HM మరియు MEO లదే.

బదిలీల వెబ్సైట్ లో ఎమ్.ఈ.ఓ/డీ.వై.ఈ.ఓ లకు లాగిన్ లు కేటాయింపు

★ ఎం.ఈ.ఓ/డీ.వై.ఈ.ఓ లకు ప్రత్యేక వెబ్ లింక్ అందుబాటు

ఉపాధ్యాయుల దరఖాస్తులో తప్పులుంటే రిజెక్ట్ చేసే ఆప్షన్

★ ఉపాధ్యాయులు సబ్మిట్ చేసే ఆన్లైన్ దరఖాస్తులను పరిశీలించి తదుపరి లెవెల్ కు పంపేందుకు ఎం.ఈ.ఓ మరియు డీ.వై.ఈ.ఓ లకు లాగిన్ లు కేటాయించారు. 

★ ఈ మేరకు వారి యొక్క యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ లను వారికి మెయిల్ మరియు సందేశాల ద్వారా తెలిపారు. 

★ ఎం.ఈ.ఓ మరియు డీ.వై.ఈ.ఓ లు వారి పరిధి లోని ఉపాధ్యాయులు సబ్మిట్ చేసిన దరఖాస్తులను సునిశితంగా పరిశీలించి తప్పులు ఉంటే రిజెక్ట్ చేస్తారు. 

★ ఇలా రిజెక్ట్ చేసిన అప్లికేషన్ ను షెడ్యూల్ తేదీ పూర్తి అయ్యాక కూడా ఉపాధ్యాయులు వారి లాగిన్ లో సరి చేసి రీ సబ్మిట్ చేయవచ్చు. 

Flash...   GIS MAPPING NOT DONE SCHOOLS AND COLLEGES

★ ఉపాధ్యాయుల దరఖాస్తులో అన్ని వివరాలు సరిగా ఉంటేనే తదుపరి లెవెల్ కు సబ్మిట్ చేస్తారు. 

★ ఆ పై జిల్లా విద్యాశాఖ కార్యాలయం వారు దరఖాస్తు లను పరిశీలించి అప్రూవ్ చేస్తారు.

అక్టోబర్ లో ప్రమోషన్ తీసుకున్న వారు ట్రస్న్ఫర్ అప్లికేషన్ పెట్టుకోవాలా?  

 నిన్నటి నుంచి వాట్స్ అప్ లో తిరుగుతున్న Messages మీద CSE వారి క్లారిటీ కోసం ప్రయత్నించగా  వారు ఇచ్చిన క్లారిటీ : ప్రస్తుతం అక్టోబర్ లో ప్రమోషన్ కి  విల్లింగ్ ఇచ్చిన ఎవరు కూడా అప్లై చేసుకోవలసిన అవసరం లేదు. 

వీరి కోసం సోమ లేదా మంగళ వారం లో DEO లకి ఇచ్చే స్పెషల్ లాగిన్ లో ఆఫీస్ వారే వీరి పేర్లు నమోదు చేయుదురు. 

అపుడు ట్రాన్స్ఫర్లు లో అప్లై చేసుకున్న వారి సీనియారిటీ కింద వీరి సీనియారిటీ రాగలదు . తరువాత వీరు web options  అందరితో పాటు పెట్టుకునే అవకాశం ఇస్తామని  మరియు దీని మీద సోమవారం పూర్తి క్లారిటీ గా మార్గదర్శకాలు ఇవ్వగలమని చెప్పి ఉన్నారు. 

కాబట్టి ప్రమోషన్ కి విల్లింగ్ ఇచ్చిన వారు ఎవరు కంగారు పడొద్దు మరియు అప్లై చేయొద్దు.

ప్రమోషన్ పొందిన వారి వివరాలు నింపుటకు DEO లకు provision ఇచ్చినారు. ఈ format లో వివరాలు నింపి సబ్మిట్ చేస్తారు. ప్రమోషన్ ర్యాంక్ ఆధారం గా వీరికి places web కౌన్సెలింగ్ ద్వారానే   కేటాయించబడతాయి