ఉపాధ్యాయ బదిలీల్లో అడ్డ దారులు .. రెండుసార్లు Spouse వినియోగానికి ఉపాధ్యాయ నేత యత్నం

 అడ్డదారుల్లో స్పౌజ్

రెండుసార్లు వినియోగానికి ఉపాధ్యాయ నేత యత్నం

కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగైనా దరఖాస్తులు

పలువురు టీచర్ల దుర్వినియోగం

నేడు జిల్లా కేంద్రంలో వెరిఫికేషన్‌

4 కేంద్రాల ఏర్పాటు

19 బృందాల నియామకం

అక్రమార్కులను పట్టేరా?

అనంతపురం విద్య, నవం బరు 21: బదిలీల్లో కొందరు ఉ పాధ్యాయుల అక్రమాలు అన్నీ ఇ న్నీ కావు. ప్రయోజనం పొందేందుకు ఉన్న అన్ని అడ్డదారులూ తొక్కుతున్నారు. జిల్లావ్యాప్తంగా 1,104 మంది టీచర్లు స్పౌజ్‌ కేటగిరీలో దరఖాస్తు చేసుకున్నారు. చాలామంది టీచర్లతో పాటు పలువురు ఉపాధ్యాయ సం ఘాల నాయకులు సైతం అడ్డదారుల్లో వెళ్లారు. దీంతో ప్రిఫరెన్షియల్‌ కేటగిరీ సర్టిఫికెట్లపైనే కాకుండా స్పౌజ్‌ కేటగిరీ వాటిపై కూడా విచారణకు అధికారులు సిద్ధమయ్యారు. ఇందుకోసం జిల్లా కేంద్రంలో నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేశారు. మరో 19 బృందాలను నియమించారు. దీంతో అక్రమమార్గాల్లో వచ్చిన చేపలు ఏ మేరకు విచారణ గాలాలకు చి క్కుతాయో చూడాలి.

రాష్ట్ర నాయకుడినంటూ అడ్డదారిలో..

జిల్లాలో ఓ ఉపాధ్యాయుడు సంఘానికి రాష్ట్ర నాయకుడినని చెప్పుకుంటున్నారు. ఇటీవల జాక్టోలో కీలక పోస్టు వచ్చిందంటూ తిరుగుతున్నారు. ఆ నాయకుడితోపాటు ఆయన భార్య కూడా టీచరే. గతం లో ఆయన భార్య బదిలీల్లో స్పౌజ్‌ కేటగిరీ ప్రయోజనం పొందారు. తాజాగా ఆయన స్పౌజ్‌ పాయింట్లు వినియోగించుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. ఇది నిబంధనలకు విరుద్ధం. అయినా పైరవీలకు తెర తీశాడు. ఇటీవల అమరావతి వెళ్లి, అక్కడ చక్రం తిప్పాలని చూశాడు. పప్పులు ఉడకలేదు. మళ్లీ జిల్లా విద్యాశాఖాధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఈయన విషయంలో ఉన్నతాధికారుల నుంచి క్లారిఫిరేషన్‌ తీసుకునే ప్రయత్నాలు చేసి, విద్యాశాఖాధికారులు సైతం చేతులు కాల్చుకున్నట్లు సమాచారం. ఈయనతోపాటు వందలాది టీచర్లు తమ భార్యలు లేదంటే భర్తలు కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులుగా పని చేస్తున్నారంటూ స్పౌజ్‌ కోటాలో పాయింట్లు పొందేందుకు దరఖాస్తు చేశారు. సర్వీసు రిజిస్టర్లు లేకున్నా, రెగ్యులర్‌ కాకున్నా షాట్‌కట్‌లో స్పౌజ్‌ నెపంతో లబ్ధి పొందేందుకు చూస్తున్నారు. మరికొందరు నకిలీ విడాకుల పత్రాలు సైతం సమర్పించారన్న ఆరోపణలున్నాయి. 

Flash...   అమ్మకానికి అందమైన ఐలాండ్ - ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

19 బృందాల ఏర్పాటు

అనేక ఆరోపణలు నేపథ్యంలో జిల్లా విద్యాశాఖాధికారులు స్పౌజ్‌ సర్టిఫికెట్లపై ఆదివారం విచారణకు సిద్ధమయ్యారు. ఇందుకోసం జిల్లా కేంద్రంలో 4 కేంద్రాలు ఏర్పాటు చేశారు. అనంతపురం డివిజన్‌కు సంబంధించి న్యూటౌన్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, గుత్తి డివిజన్‌కు రాజేంద్ర మున్సిపల్‌ హైస్కూల్‌, ధర్మవరానికి కేఎ్‌సఆర్‌ ఉన్నత పాఠశాల, పెనుకొండకు సమగ్రశిక్ష కార్యాలయంలో 19 బృందాలతో సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టనున్నారు.

చేపలు చిక్కేనా?

1104 స్పౌజ్‌ దరఖాస్తులో అక్రమమార్గాల్లో పాయింట్లు పొందేందుకు చేసుకున్న టీచర్లు భారీగానే ఉన్నారు. వీరి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటే సర్టిఫికెట్లను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంది. తూతూ మంత్రంగా వెరిఫికేషన్‌ చేస్తే.. అక్రమమార్గాల్లో వచ్చిన దరఖాస్తులను కనుక్కోవటం కష్టమే. 2009, 2011, 2013, 2015, 2017ల్లో బదిలీలు జరిగాయి. ఆయా బదిలీల జాబితా ముందు పెట్టుకుని, పరిశీలించాలి. మరికొందరు స్పౌజ్‌ వాడుకుని కూడా అధికారులకు నోట్లు కొట్టి, సర్వీసు రిజిస్టర్లలో రాయించుకోకుండా తప్పించుకున్నారు. గతంలోని బదిలీల జాబితాలు, సర్వీసు రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలిస్తే కానీ అక్ర మ మార్గాల్లో వచ్చిన చేపలు గాలానికి పడటం కష్టం.