6 Question papers in SSC

 పదో తరగతిలో 6 ప్రశ్నపత్రాలే?

కరోనా నేపథ్యంలో ఏపీ విద్యాశాఖ మార్పు

ఈనాడు, అమరావతి: కరోనా నేపథ్యంలో పదోతరగతి ప్రశ్నపత్రాలను ఆరుకు తగ్గించాలని ఏపీ విద్యాశాఖ భావిస్తోంది. గతేడాది ప్రశ్నపత్రాల సంఖ్యను తగ్గించినప్పటికీ కొవిడ్‌-19 ఉద్ధృతి కారణంగా పరీక్షలను నిర్వహించలేదు. అప్పట్లో ఒక్క ఏడాదికి మాత్రమే ఈ విధానమంటూ పాఠశాల విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలోనూ అదే పరిస్థితి కొనసాగుతుండటంతో ఆరు ప్రశ్నపత్రాలతోనే పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు. గతంలో ఒక్కో పేపర్‌ 50మార్కులకు ఉండగా ఇప్పుడు ఒక్క పేపరే వంద మార్కులకు నిర్వహించనున్నారు.

Flash...   NEP: కొత్త ఎడ్యుకేషన్‌ పాలసీలో 5+3+3+4 స్ట్రక్చర్‌ అంటే ఏంటి? ఫ్రేమ్‌వర్క్ గురించి పూర్తి వివరాలు..