Teachers Transfers process

ఉపాధ్యాయ బదిలీలు షురూ!

ఊపందుకున్న ఆప్షన్ల ప్రక్రియ

జిల్లాలో 393 మంది దరఖాస్తు

మచిలీపట్నం: ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ వేగం పుంజుకుంది. ఆదివారం మధ్యాహ్నం 3గంటలకు విద్యాశాఖ కమిషనరేట్ అధికారులు ప్రకటించిన మేరకు జిల్లాలో 393 మంది ఉపాధ్యాయులు బదిలీ కోసం కోరుకున్న ప్రదేశాలను ఎంపిక చేసుకొని వెబ్ ఆప్షన్ ఇచ్చారు. నచ్చిన చోటుకు వెళ్లేం దుకు వెబ్ సైట్ లో ఆప్షన్ ఇచ్చుకునేందుకు ఈ నెల 15 వరకు గడువు ఉండటంతో ఉపాధ్యాయులు ఆచితూచి వ్యవహరి’ స్తున్నారు. జిల్లాలో 5,004 మంది ఉపాధ్యాయులు బదిలీ కోసమని వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా తప్పనిసరిగా బదిలీ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వాహించాలనే డిమాండ్ తో ఓ పక్క ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. దీం తో వెబ్ ఆప్షన్లు ఇవ్వాలా..? వద్దా అనే సందిగ్ధంలో ఉపాధ్యా యులు కొట్టుమిట్టాడుతున్నారు. ఖచ్చితంగా సైట్లో ఆప్షన్ ఇవ్వాలని ఇప్పటికే విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పష్టం చే వెబ్ ఆప్షన్ ఎలా ఇవ్వాలనే దానిపై విద్యాశాఖ జాయింట్ డైరక్టర్ (సర్వీసెస్) డి.దేవానందరెడ్డి వీడియో సం దేశం ద్వారా ఉపాధ్యాయులందరికీ చేరవేస్తున్నారు. సామా జిక మాధ్యమాల్లోనూ పంపిస్తున్నారు. ఈ నెల 15 వరకు వెబ్ ఆప్షన్ ఇచ్చేందుకు గడువు ఉంది. ఈ లోగానే తప్పనిస రిగా బదిలీ ప్రదేశాన్ని సూచిస్తూ ఉపాధ్యాయులు ఆప్షన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. 16 నుంచి 21 వరకు బదిలీ అయిన ప్రదేశాలను చూపుతూ వెబ్ సైట్ లో జాబితా పెడతారు. 22, 23 తేదీల్లో సాంకేతికపరమైన సమస్యలను పరిష్కరించి, 24న బదిలీ ఉత్తర్వులు జారీ చేస్తారు

Flash...   Development of 7th class Text books for the academic year 2021 - 22