Unblock the vacancies in Transfers

 ఉపాధ్యాయ ఖాళీలు బ్లాక్‌

ఆందోళనలో గురువులు

ఖాళీలు చూపించాలంటూ ఉద్యమ బాట

🌻(కడప – ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల బదిలీలకు కసరత్తు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో కొందరు ఉపాధ్యాయుల్లో ఆశలు చిగురించాయి. ఇప్పటి దాకా సుదూర ప్రాంతాల్లో పనిచేశాం.. ఇప్పుడైనా బదిలీలతో కాస్త దగ్గరకు వెళతామని ఆనందించారు. అయితే వారి ఆశలను ఆవిరి చేస్తూ విద్యాశాఖ షాక్‌ ఇచ్చింది. పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను బదిలీల్లో చూపకుండా బ్లాక్‌ చేసింది. నిబంధనల మేరకు తప్పనిసరిగా బదిలీ అయ్యే టీచర్ల సంఖ్యకు సమానంగా బ్లాక్‌ లిస్టులో పెట్టేసింది. పోస్టుల బ్లాక్‌ వ్యవహారం ఉపాధ్యాయ లోకాన్ని ఆందోళన బాట పట్టిస్తోంది. నిబంధనల మేరకే పోస్టులు బ్లాక్‌ చేస్తున్నామని, ఇది ఎప్పుడూ జరిగే పనే అని విద్యాశాఖ సమర్ధించుకుంటోంది. అయితే ఖాళీల మొత్తం ప్రకటించాలంటూ ఉపాధ్యాయ లోకం డిమాండ్‌ చేసింది. ఇప్పటికే ఉద్యమబాట పట్టారు. జిల్లాలో ఎస్‌జీటీ ఖాళీలు 1969 ఉన్నాయి. 1350 మంది తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంది. వీరిలో ఒకే స్కూలులో 5 ఏళ్ల నుంచి 8 సంవత్సరాల వరకు పనిచేసిన వారు ఉన్నారు. రేషనలైజేషన ఎఫెక్ట్‌ అయిన వారు మరో 70 మంది ఉన్నారు. అంటే మొత్తం 1422 మంది బదిలీ కావాల్సి ఉంది. అయితే 668 పోస్టులను బ్లాక్‌ చేశారు. ఖాళీలు కేవలం 1301 మాత్రమే ఉన్నాయి. పోరుమామిళ్లలో నాలుగు ఖాళీలు చూపించి 20 బ్లాక్‌ చేశారు. బద్వేలులో 23, సీకేదిన్నెలో 18, పెండ్లిమర్రిలో 20, రాజంపేటలో 22, రాయచోటిలో 22 బ్లాక్‌ చేశారు. దీని వల్ల సుదూర ప్రాంతాల్లో ఉన్న వారు  దగ్గరకు రాలేని పరిస్థితి నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలను దృష్టిలో పెట్టుకుని బ్లాక్‌ లిస్టులో పెట్టినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇదే చోట 20 ఏళ్లు పనిచేసినప్పటికీ దగ్గర ప్రాంతం రాకుండా మళ్లీ ఆ ప్రాంతంలోనే పనిచేయాలా అంటూ ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. 

♦జీవో నెం.50ని తుంగలో తొక్కింది – రాజశేఖర్‌, ఏపీ వైఎ్‌సఆర్‌టీఎఫ్‌  

Flash...   How to register in DIKSHA for upcoming NISHTHA online trainings for Teachers

రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.50ని తుంగలో తొక్కి దివ్యాంగులకు తీవ్ర అన్యాయం చేసింది. గత ప్రభుత్వం చట్టం చేసినప్పటికీ ఈ ప్రభుత్వం అమలు చేయకపోవడం దుర్మార్గం. ప్రభుత్వానికి నూకలు చెల్లాయి.

♦ఏకపక్షంగా బదిలీలు – ఖాదర్‌బాషా, ఏపీటీఎఫ్‌

ప్రభుత్వం ఏకపక్షంగా బదిలీలు నిర్వహిస్తూ ఉపాధ్యాయులకు అన్యాయం చేస్తోంది. ఖాళీలన్నీ చూపించాల్సిందే. మాన్యువల్‌ పద్ధతిలోనే బదిలీలు నిర్వహించాలి. గతంలో ఎన్నడు లేని విధంగా ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోంది. 

♦ఖాళీలన్నీ చూపించాల్సిందే  – ఇలియా్‌సబాషా, ఎస్టీయూ 

బదిలీల్లో అర్హులైన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలంటే ఖాళీలన్నీ చూపించాల్సిందే. ఎనిమిదేళ్లపాటు ఇదే ప్రాంతంలో పనిచేసిన వారు దగ్గరకు రావాలని కోరుకుంటారు. అయితే ఇప్పుడు పోస్టులు బ్లాక్‌ చేసి అర్హులకు మొండిచేయి చూపారు. అన్ని ఖాళీలు చూపించాల్సిందే. 

నేడు ఫ్యాప్టో ప్రతినిధులతో చర్చలు

ఏలూరు ఎడ్యుకేషన్, డిసెంబరు 13: మాన్యువల్ కౌన్సెలింగ్, అన్ని వేకెన్సీల డిస్ ప్లే వంటివి ప్రధాన అంశాలుగా ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) ప్రతినిధులతో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ ఉన్నతాధికారులు చర్చలు జరపనున్నారు. ఆ మేరకు విద్యాశాఖ జేడీ (సర్వీసులు) దేవానంద్ రెడ్డితో ఫ్యాప్టో సభ్యసంఘాల నాయకులు చర్చలు నిర్వహిస్తారని తెలిసింది.