బదిలీల సమస్యలపై పాఠశాలల్లో ఉపాధ్యాయుల నిరసనలు

 ప్రభుత్వ పోకడలపై పోరుబాటు

బదిలీల సమస్యలపై పాఠశాలల్లో ఉపాధ్యాయుల నిరసనలు..

వైఎ్‌సఆర్‌టీఎఫ్‌ నాయకులూ వినతులు 

అనంతపురం విద్య, డిసెంబరు 14: బదిలీల్లో రాష్ట్ర ప్రభుత్వ పోకడలపై ఉపాధ్యాయులు పోరుబాట పట్టారు. సోమవారం జి ల్లావ్యాప్తంగా ఉపాధ్యాయులు, అన్ని సంఘాల నాయకుల నుం చి నిరసనలు, వినతులు వెల్లువెత్తాయి. అధికార పార్టీకి చెందిన వైఎ్‌సఆర్‌టీఎఫ్‌ నాయకులు సైతం వినతుల రూపంలో తమ వైఖరిని వ్యక్తం చేశారు. బదిలీల కౌన్సెలింగ్‌ మాన్యువల్‌గా నిర్వహించాలనీ, ఖాళీలనన్నింటినీ చూపాలంటూ ఉపాధ్యాయులు, సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం, విద్యాశాఖ ఉన్నతాఽధికారులు స్పందించకపోవటంతో పోరుబాటకు సిద్ధమయ్యారు. జిల్లావ్యాప్తంగా భోజన విరామ సమయంలో ఉపాధ్యాయులు, నాయకులు నిరసనలు వ్యక్తం చేశారు. బ్లాక్‌ చేసిన ఖాళీలను చూపించాలనీ, ఆఫ్‌లైన్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. అనంతపురం నగర పరిధి, ముదిగుబ్బ, ధర్మవరం, రాయదుర్గం, తాడిపత్రి తదితర మండలాల్లోని పాఠశాలల్లో టీచర్లు నిరసనలు తెలిపారు. ఫోర్టో నాయకులు, టీచర్లు ప్లకార్డులు ప్రదర్శించారు. వైఎ్‌సఆర్‌టీఎ్‌ఫకు చెందిన రెండు సం ఘాల నాయకులు వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిని వేర్వేరుగా కలిసి, వినతులు అందించారు.

Flash...   New Districts Educational Codes