బదిలీలు కొంతమందికేనా

విద్యాశాఖ తీరుపై టీచర్ల నిరాశ

చిత్తూరు(సెంట్రల్‌), డిసెంబరు 11: టీచర్ల బదిలీ ప్రక్రియకు సంబంధించి ఆప్షన్ల ఎంపిక ప్రక్రియ శుక్రవారం నుంచి మొదలైంది. విద్యాశాఖ యంత్రాంగం ఆరువేల ఖాళీలను గుర్తించినా యాభై శాతం మాత్రమే బదిలీ స్థానాలుగా చూపించడం టీచర్లను నిరాశకు గురిచేస్తోంది. జిల్లా విద్యాశాఖలో కేడర్ల వారీగా ఖాళీ పోస్టులను గుర్తించారు. అయితే పెద్దసంఖ్యలో వీటిని బ్లాక్‌ చేయాలన్న ఉన్నతాధికారుల ఆదేశాలందాయి. ఆ మేరకు.. 6004 ఖాళీలకు 2851 బ్లాక్‌ చేసి, 3153 ఖాళీలను క్లియర్‌ వేకెన్సీ కింద చూపారు. బదిలీలకు 7861 మంది టీచర్లు దరఖాస్తు చేసుకోవడంతో సగం మంది నిరాశ చెందాల్సి వస్తోంది. ఒకే ప్రాంతంలో 8ఏళ్ల పాటు పనిచేసిన 2858 మంది తప్పనిసరిగా బదిలీ కానున్నారు. మిగిలిన 295 ఖాళీలకు 5003 మంది పోటీ పడాల్సి వస్తోంది. దీంతో పోటీగా ఉన్న ఉపాధ్యాయుడి అనర్హత వివరాలు తెలియజేస్తూ విద్యాశాఖ అధికారులకు అధికసంఖ్యలో అభ్యంతరాలందాయి. టీచర్ల బదిలీలకు సంబంధించి ప్రభుత్వ, జడ్పీ పాఠశాలల్లో పనిచేస్తున్న హెచ్‌ఎంలు, స్కూల్‌ అసిస్టెంట్లు, సెకండరీగ్రేడ్‌ టీచర్లు, ప్రైమరీ స్కూల్‌ హెచ్‌ఎంల కేటగిరీలుగా విభజించారు. ఇక క్లియర్‌ వేకెన్సీ కింద ఆప్షన్లను ఎంపిక చేసుకునే ప్రక్రియ శుక్రవారం నుంచి మొదలైంది.

Flash...   Optimus Gen-2: డ్యాన్స్‌తో పాటు పనులు చేసే రోబోను రిలీజ్‌ చేసిన టెస్లా.. Humanoid రోబోల్లో సరికొత్త ఇన్వెన్షన్‌..