అమ్మ ఒడికి 84,921 మంది దూరం .. అభ్యంతరాలను పరిష్కరిం చేందుకు పది రోజుల్లోగా మార్గదర్శకాలు

 84,921 మందికి అమ్మ ఒడి దూరం

ఏలూరు ఎడ్యుకేషన్‌, జనవరి 11: అమ్మ ఒడి పథకానికి ఆరు రకాల కారణాలతో (సిక్స్‌ స్టెప్‌ రీజన్స్‌) 84,921 మంది దూరమయ్యారు.  వీటిపై వచ్చిన అభ్యంతరాలను పరిష్కరిం చేందుకు పది రోజుల్లోగా మార్గదర్శకాలు ఇవ్వనున్నట్లు విద్యాశాఖ స్పష్టత ఇచ్చింది. జిల్లాలో ఒకటి నుంచి ఇంటర్మీడియట్‌ ద్వితీ య సంవత్సరం(జూనియర్‌ ఇంటర్‌ మినహా) వరకూ చదువుతున్న విద్యార్థుల్లో మొత్తం 76,993 మందిని అనర్హుల జాబితాలో చేర్చారు. వీరితోపాటు మరో 7,454 మంది విద్యార్థుల వివరాలను మరో దఫా పరిశీలన (రీవెరిఫికేషన్‌) చేయాలని జిల్లా విద్యాశాఖకు సూచించగా, మరో 474 మంది అనాఽథలైన విద్యా ర్థులు సోమవారం ఆర్థిక సాయానికి దూరమైన అనర్హుల్లో ఉన్నారు. 

Ineligible ‌ జాబితాలోని విద్యార్థుల అర్హతలపై క్షేత్ర స్థాయిలో ఆయా శాఖల సిబ్బందితో పరిశీ లన జరిపేందుకు కొద్ది రోజుల్లో మార్గదర్శకాలను ఇవ్వనున్నారు. అర్హతలు ఉన్నట్లు నిర్ధారణ చేస్తే రెండో దఫాలో రూ.14 వేలు చొప్పున యూనిక్‌ తల్లులు, సంరక్షకుల బ్యాంకు ఖాతాలకు నగదు జమచేస్తారు. అమ్మఒడి పొందిన తల్లుల్లో చింతలపూడి నియోజక వర్గం 48,453 మందితో జిల్లాలో ప్రథమస్థానంలో ఉండగా, ఆ తరువాత స్థానాల్లో 41,223 మందితో పోలవరం, 40,824 మందితో గోపాలపురం ఉన్నాయి. చివరి స్థానంలో 25,491 మంది తల్లులతో పాలకొల్లు నియోజకవర్గం ఉంది. 

Flash...   WEIGHT LOSS FOOD: బరువు తగ్గాలనుకునేవారు రాత్రిపూట ఈ ఆహారాన్ని తినండి..?