డిగ్రీ అడ్మిషన్లకు గడువు పెంపు

ఈ నెల 21 వరకు పొడిగింపు

ఊపిరి పీల్చుకున్న విద్యార్థులు

ఆన్‌లైన్‌పై కొరవడిన అవగాహన

ప్రభుత్వం, వర్సిటీల తీరుపై విమర్శలు

చివరి రోజుల్లో ప్రైవేట్‌ యాజమాన్యాల హడావిడి

నెల్లూరు (స్టోన్‌హౌ్‌సపేట) జనవరి 18 : తొలిసారిగా ఆన్‌లైన్‌ విధానంలో  నిర్వహిస్తున్న డిగ్రీ అడ్మిషన్ల  గడువును ఈ నెల 21వ తేదీ వరకు పెంచుతూ ప్రభుత్వం  ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు.  ఆన్‌లైన్‌లో అడ్మిషన్లపై విద్యార్థులకు  అవగాహన కల్పించడంలో అటు ప్రభుత్వం, ఇటు విక్రమ సింహపూరి యూనివర్సిటీ పూర్తిగా విఫలమయ్యాయి.  ఈ విషయమై విమర్శలు తలెత్తుతున్నాయి. 

ప్రైవేటు కళాశాలల లీలలెన్నో..

ఆన్‌లైన్‌లో డిగ్రీ అడ్మిషన్లను ప్రభుత్వం నిర్వహిస్తుందని అనుకోని ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు ముందుగానే తమ కళాశాలల్లో విద్యార్థులను ఆఫ్‌లైన్‌లో అడ్మిషన్లు చేసుకున్నాయి. అంతేగాక విద్యార్థులకు తరగతులు కూడా నిర్వహించాయి. ప్రభుత్వం ఆన్‌లైన్‌లో అడ్మిషన్లు అనగానే తమ కళాశాలల్లోనే విద్యార్థులను చేర్చుకునేందుకు అనేక పథకాలు రచించాయి. అందులో భాగంగా అప్పటికే తమ కళాశాలల్లో చేరిన విద్యార్థుల అడ్మిషన్లను తమ కళాశాలల్లోని కంప్యూటర్‌ ల్యాబ్‌ల్లో సిబ్బంది దగ్గర ఉండి చేయించారు. ఈ క్రమంలో విద్యార్థుల ఫోన్‌ నెంబర్లకు ఓటీపీలు వస్తే వారు నచ్చిన కళాశాలలకు ఎక్కడ వెళతారన్న అనుమానంతో కళాశాలలోని కొందరు సిబ్బంది తమ ఫోన్‌ నెంబర్లను విద్యార్థి ఫోన్‌ నెంబర్‌లా ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. దీంతో ఆన్‌లైన్‌ ఆ దరఖాస్తులను రిజెక్ట్‌ చేసింది. విద్యార్థులు దరఖాస్తు పక్రియ ముగిస్తున్న చివరి రోజుల్లో జిల్లాలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. ఒక్క పోన్‌నెంబరుపై పదికి పైగా దరఖాస్తులు చేయడంతో ఆన్‌లైన్‌లో విద్యార్థుల దరఖాస్తులు రద్దు అయినట్లు హెల్ప్‌లైన్‌ సెంటర్‌ సిబ్బంది తేల్చారు. ప్రధానంగా నెల్లూరులోని డీకే మహిళ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ సెంటర్‌కు ఒకే ఫోన్‌ నెంబరుతో పదుల సంఖ్యలో దరఖాస్తులు చేయబడిన విద్యార్థులు ఎక్కువుగా హాజరవుతున్నారు. ఇలా ఆన్‌లైన్‌ డిగ్రీ అడ్మిషన్ల లో ప్రైవేట్‌ విద్యాసంస్థల లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

Flash...   Life skills and career guidance program Students orientation

చూసీచూడనట్లు వర్సిటీ అధికారులు

 అడ్మిషన్లకు గడుపు ముగిస్తుండటంతో వర్సిటీ అధికారులు హడావిడి చేస్తున్నారు. అడ్మిషన్ల పక్రియ ప్రారంభమైన రోజు నుంచి ఆంధ్రజ్యోతి పలు కథనాలను ప్రచూరిస్తూ ప్రైవేట్‌ విద్యాసంస్థలు చేస్తున్న ఆగడాలను అందరికీ తెలిసేలా చేసినా వర్సిటీ అధికారులు స్పందించలేదు. అయితే ఇప్పుడు పదుల సంఖ్యలో విద్యార్థుల అడ్మిషన్లను ఒక్క ఫోన్‌ నెంబర్‌ సాయం తో చేయాలని ప్రైవేట్‌ విద్యాసంస్థలు ప్రయత్నించాయి. ఇప్పుటికీ వర్సిటీ అధికారులు ఈ తప్పుడు చర్యలపై నోరు పెదపకపోవడం చూస్తుంటే ప్రైవేట్‌ విద్యాసంస్థల యజమా నులకు, వర్సిటీ అధికారులకు మధ్య ఏం జరిగిందోనని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గుసగుసలాడుతున్నారు.