Amazon ‌ మరో కొత్త‌ సేల్‌.. ఫోన్లపై భారీ డిస్కౌంట్‌

Amazon-Republic-day

న్యూఢిల్లీ: అమెజాన్ మరో కొత్త సేల్ తో ముందుకు రాబోతుంది. జనవరి 20 నుంచి
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ప్రారంభంకానునట్లు సంస్థ పేర్కొంది. ఈ సేల్
జనవరి 23 వరకు కొనసాగనుంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులు 24 గంటల(జనవరి 19) ముందుగానే
ఈ సేల్ లో పాల్గొనవచ్చు. గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సమయంలో షాపింగ్ చేసే
వినియోగదారులు ఎస్బిఐ క్రెడిట్ కార్డులు, క్రెడిట్ ఈఎంఐలపై 10 శాతం తక్షణ
తగ్గింపు పొందవచ్చు. ఈ సేల్ లో నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉంటాయి. నో-కాస్ట్
ఈఎంఐ ఆప్షన్ కేవలం బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డ్, అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్
కార్డ్, అమెజాన్ పే లేటర్, డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసే
యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది

రిపబ్లిక్ డే సేల్ లో భాగంగా ఎకో స్మార్ట్ స్పీకర్లు, ఫైర్ టివి స్టిక్ డివైజ్ లు
40 శాతం వరకు కిండ్ల్ ఇ-రీడర్స్ పై రూ.3,000 వరకు ఆఫ్ లభిస్తుంది. వన్‌ప్లస్ 8టీ
40,499 రూపాయలకు లభించనుంది. ఈ వన్‌ప్లస్ ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 865
ప్రాసెసర్, 5జీ సపోర్ట్, 120 హెర్ట్జ్ అమోలేడ్ డిస్‌ప్లే, 65 డబ్ల్యూ ఫాస్ట్
ఛార్జర్ ఉన్నాయి. ఐఫోన్ 12 మీనీ మొబైల్ 59,990కి లభించనుంది. శామ్‌సంగ్ గెలాక్సీ
ఎం51 కూడా రూ.20,999 ధరకే లభిస్తుంది. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్
సందర్భంగా ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో ఇయర్‌బడ్‌లు రూ.20,999 ధరకే లభిస్తాయి. అలాగే
మొబైల్స్ తో పాటు ఇతర ఉత్పత్తులు మీద కూడా భారీ ఆఫర్లు గ్రేట్ రిపబ్లిక్ డే సేల్
లో లభించనున్నాయి.

Flash...   AP ఇంటర్‌ అర్హతతోనే సాప్ట్‌వేర్‌ ఉద్యోగం.. HCL తో నైపుణ్యాభివృద్ధి సంస్థ ఒప్పందం