AP: ఇంటర్‌ విద్యార్థులకుజ‌న‌వ‌రి 18 నుంచి క్లాసులు. అకడమిక్‌ కేలండర్‌ విడుదల

 జ‌న‌వ‌రి 18 నుంచి క్లాసులు ప్రారంభం

మే 31వరకు క్లాసుల నిర్వహణ

మార్చి 25 నుంచి 31 వరకు హాఫ్‌ ఇయర్లీ పరీక్షలు

ఏప్రిల్‌, మే నెలల్లో వార్షిక పరీక్షలు

ఏపీలో ఇంటర్‌ విద్యార్థులకు విద్యామండలి కీలక ప్రకటన విడుదల చేసింది. ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌ క్లాసులు మే 31వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్‌ విద్యామండలి ప్రకటించింది. తాజాగా సవరించిన ఫస్టియర్‌ అకడమిక్‌ కేలండర్‌ను జ‌న‌వ‌రి 15న‌ విడుదల చేసింది. జ‌న‌వ‌రి 18 నుంచి ప్రారంభమయ్యే తరగతులు మొత్తం 106 రోజులు జరగనున్నాయి.

రెండో శనివారం, వేసవి సెలవులను రద్దు చేశారు. హాఫ్‌ ఇయర్లీ పరీక్షలు మార్చి 25 నుంచి 31వరకు నిర్వహిస్తారు. ప్రీఫైనల్‌, బోర్డు థియరీ పరీక్షలను ఏప్రిల్‌, మే నెలల్లో నిర్వహించనున్నారు.

18 నుంచి క్లాసులు ప్రారంభం:

ఇక ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థులకు జ‌న‌వ‌రి 18న తరగతులు ప్రారంభం కానున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభం ఆలస్యమైనందున పనిదినాలు 160 రోజులకు పరిమితం చేశారు. ఆరో తరగతి విద్యార్థులకు కూడా జ‌న‌వ‌రి 18 నుంచి తరగతులు మొదలవుతాయి. 1-5వ తరగతుల ప్రారంభంపై సీఎం జగన్‌ నిర్ణయం తీసుకోనున్నారు.

వచ్చే ఏడాది ఆన్‌లైన్‌లోనే ఇంటర్‌ ప్రవేశాలు

వచ్చే విద్యా సంవత్సరం(2021-2022) నుంచి ఇంటర్‌ ప్రవేశాలు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తామని మంత్రి సురేశ్ తెలిపారు. కార్పొరేట్‌ యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలు అమలుచేయకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆకస్మిక తనిఖీలు ఇకపై నిరంతరం జరుగుతుంటాయన్నారు.

విద్యార్థుల వసతిగృహాల నిర్వహణకు అవసరమైతే కొత్త నిబంధనలు తెస్తామని వెల్లడించారు. కొవిడ్‌ కారణంగా ట్యూషన్‌ ఫీజులో 70 శాతమే యాజమాన్యాలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు గుర్తుచేశారు. ప్రవేశాల సమయంలో విద్యార్థుల నుంచి ఒరిజినల్‌ ధ్రువపత్రాలు తీసుకొని పరిశీలించి వెనక్కి ఇచ్చేయాలని.. నిబంధనలు అతిక్రమిస్తే యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులు డీజీపీకి లేఖ రాసినట్లు మంత్రి వెల్లడించారు.

Flash...   SONU SOOD: ఇంటికే ఆక్సిజ‌న్ ఇస్తాం.. సోనూసూద్ కీల‌క నిర్ణ‌యం

1 Comment

  1. Himachal Pradesh Board of School Education releases the class 10th model question papers 2021 in the online mode. HP board 10th model papers 2021 plays a very important role in the analysis of a candidate's preparation level. HP Board 10th Question Paper 2021 Presently the board examines 10th class examinations. Annually, 5 lakhs of candidates appear in the examination conducted by the HP board.

Comments are closed