Appeals on Transfers

బదిలీలపై అప్పీళ్లు

చిత్తూరు కలెక్టరేట్: ఉపాధ్యాయుల బదిలీలపై అప్పీళ్లను  స్వీకరించనున్నట్లు డీఈఓ నరసింహారెడ్డి తెలి పారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లా డుతూ ఇందు కోసం తన కార్యాలయంలో ప్రత్యేక కౌం టర్లను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. బదిలీల ప్రక్రియలో ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించి, వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకుని సంక్రాంతి సెలవుల్లో బదిలీ ఆర్డర్లు పొందిన ఉపాధ్యాయులకు అప్పీళ్లు చేసుకునే అవకాశం కల్పించారని తెలిపారు. బదిలీల్లో నష్టపో యామని భావించే ఉపాధ్యాయులు ఈనెల 30 వరకు అప్పిలేట్ అథారిటీ అయిన ఆర్టేడీకి లిఖితపూర్వకంగా అప్పీల్ చేయాలన్నారు. ఆర్జేడీకి అడ్రస్ చేస్తూ టీచర్లు తాము సొంతంగా రాసిన లేఖను డీఈఓ కార్యాలయంలో అందజేయాలని చెప్పారు.

అర్హులు ఎవరంటే

ఉపాధ్యాయులకు సంబంధించిన సీనియారిటీ, వివిధ కేటగిరిల కింద ప్రాధాన్యత క్రమంలో పొందిన పాయింట్ల ఆధారంగా బదిలీల్లో తాము కోరుకున్న పాఠశాలలకు బదిలీపై వెళ్లిన వారి గురించి అప్పీల్ చేసుకోవచ్చు. రేషనలైజేషన్లో అన్యాయం జరిగిందని భావించినా.. అర్హత లేనివారికి అర్బన్ ప్రాంతాలకు దగ్గరకు పాఠశాలలను కేటాయించారనే సమాచార మున్న టీచర్లు తగిన ధ్రువపత్రాలతో అప్పీల్ చేసుకునే అవకాశముంది. స్పాజ్ కేటగిరిలో ఉన్న టీచర్లు ప్రాధా న్యత క్రమంలో పాయింట్లు పొందినప్పటికీ, అందుకు విరుద్ధంగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకుని బదిలీ పొం దినట్లు అయితే సరైన ఆధారాలతో వాటిని అధికారుల దృష్టికి తీసుకురావచ్చ.

Flash...   AP FA 4 Examinations syllabus for all Classes