January 27 నుంచి ఎఫ్‌ఏ–1 పరీక్షలు

ఏలూరు ఎడ్యుకేషన్‌, జనవరి 21: జిల్లాలోని పాఠశాలల్లో 7, 8 తరగతుల విద్యార్థులకు ఈనెల 27 నుంచి 30వ తేదీ వరకూ ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎఫ్‌ఏ–1) పరీక్షలను నిర్వహించాలని డీఈవో సీవీ రేణుక ఆదేశించారు. ఉదయం 10 నుంచి 10.45 గంటల వరకూ, మధ్యాహ్నం 11.45 నుంచి 12.30 గంటల వరకూ పరీక్షలు నిర్వహించాలన్నారు. 27న ఉదయం తెలుగు, మధ్యాహ్నం గణితం, 28న హిందీ, సైన్సు/ భౌతికశాస్త్రం, 29 ఇంగ్లీషు, జీవశాస్త్రం, 30న సోషల్‌ స్టడీస్‌, సంస్కృతం/ వృత్తి విద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు.  గతేడాది మాదిరిగానే ఎఫ్‌ఏ–1 పరీక్షల ప్రశ్నాపత్రాలను ఈ ఏడాది కూడా పాఠశాల స్థాయిలోనే తయారు చేసుకుని పరీక్షలను నిర్వహించి మార్కు లను రికార్డు పుస్తకంలో నమోదు చేయా లని కోరారు. పరీక్షలు జరిగే సమయంలో డీవైఈవోలు, ఎంఈవోలు, డీసీఈబీ సభ్యులు తమ పరిధిలోని అన్ని యాజ మాన్యాల పాఠశాలలను తనిఖీ చేయాలని ఆదేశించారు.  

Flash...   New Admissions online Process in AP Govt Schools