అమ్మ ఒడి తరువాతే టీచర్లకు బదిలీ ఆర్డర్లు

ఏలూరు ఎడ్యుకేషన్‌, డిసెంబరు 31 : బదిలీ కోసం జిల్లాలో దరఖాస్తు చేసుకున్న టీచర్ల సంఖ్యపై స్పష్టత వచ్చింది. అన్ని కేటగీరిలకు చెందిన మొత్తం 5,699 మంది హెచ్‌ఎంలు, టీచర్లు దరఖాస్తు చేసుకోగా, బదిలీ స్థానాలను ఇచ్చిన వెబ్‌ ఆప్షన్ల ఫ్రీజింగ్‌ గురువారం ముగిసింది. అందుతున్న సమాచారం ప్రకారం సోమవారం లోగా బదిలీ స్థానాల కేటాయింపుపై తొలి జాబితా విడుదల కానుంది. టీచర్లు ఇచ్చిన వెబ్‌ ఆప్షన్లు, కేటాయించిన బదిలీ స్థానంపై ఏవైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకునేందుకు కొన్ని రోజుల వ్యవధి ఇస్తారు. అనంతరం తుది జాబితాను విడు దల చేసి, బదిలీ ఆర్డర్లను జారీ చేస్తారు. అమ్మ ఒడి ఆర్థిక సాయం విడుదలయ్యే జనవరి 9వ తేదీ తరువాత బదిలీ ఆర్డర్లు జారీ అయ్యే అవకాశం ఉంది. దీనిపై విద్యా శాఖ అధికారిక షెడ్యూల్‌ విడుదల చేయాల్సి ఉంది. 

సబ్జెక్టుల వారీగా బదిలీ దరఖాస్తులు ఇలా 

మొత్తం 5,699 మంది బదిలీలకు ధరఖాస్తు చేసుకు న్నారు. వీరిలో ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎంలు 114 మంది, గ్రేడు –2 హెచ్‌ఎంలు 152, ఎస్‌జీటీలు 2,986, స్కూల్‌ అసి స్టెంట్‌ ఉర్దూ 11, గణితం 551, గణితం (ఉర్దూ) 1, ఫిజికల్‌ సైన్స్‌ 386, బయో లాజికల్‌ సైన్స్‌ 332, సోషల్‌ స్టడీస్‌ 290, స్టోషల్‌ స్టడీస్‌ (ఉర్దూ) 1, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ 62, తెలుగు 270, ఉర్దూ 2, హిందీ 153, సంస్కృతం 13, ఇంగ్లీషు 375 మంది దరఖాస్తు చేసుకున్నారు.

Flash...   OBC CREAMY LAYER: బి.సి. రిజర్వేషన్లు - క్రీమీలేయర్ .