ఇద్దరు హెచ్‌ఎంలకు ఇంక్రిమెంట్‌ కట్‌

 మరొకరికి షోకాజ్‌ నోటీసు

నాడు-నేడు పనుల నిర్వహణలో

నిర్లక్ష్యం ప్రదర్శించారంటూ ఐటీడీపీ పీవో చర్యలు

పాడేరు, జనవరి 18: మనబడి నాడు- నేడు పనులు సక్రమంగా చేయని ఇద్దరు ప్రధానోపాధ్యాయులకు రెండు వార్షిక ఇంక్రిమెంట్లను కట్‌ చేయడంతోపాటు మరో హెచ్‌ఎంకు షోకాజ్‌ నోటీసు జారీచేస్తున్నట్టు ఐటీడీఏ పీవో డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ చెప్పారు. నాడు-నేడు పనులపై సోమవారం ఆయన ఆశ్రమ పాఠశాలల హెచ్‌ఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పనులు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ అనంతగిరి మండలం లక్ష్మీపురం గిరిజన సంక్షేమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సీహెచ్‌.వెంకటరావు, కొయ్యూరు మండలం మఠంభీమవరం ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సీహెచ్‌.గోపాలంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. వీరికి రెండు వార్షిక ఇంక్రిమెంట్ల కొత విధిస్తున్నట్టు చెప్పారు. హకుంపేట మండలం మజ్జివలస ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు టి.నాగేశ్వరరావు షోకాజ్‌ నోటీసు జారీచేశారు

Flash...   Reasons for dropout in Drop Box list in student info site