రాష్ట్రంలో 27 శాతం ఫిట్‌మెంట్?

♦మధ్యంతర భృతికి సమానంగానే పిఆర్‌సి సిఫార్సు*

*♦అమలుపై ప్రభుత్వం మీనమేషాలు*

*🌻ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి:* కొద్ది రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం పిఆర్సిని బహిరంగ పరచడంతో రాష్ట్రంలో కూడా నివేదికపై చర్చ జరుగుతోంది. 11వ వేతన సవరణ కమిషన్ గత ఏడాది సెప్టెంబర్ లోనే తన నివేదికను ప్రభుత్వానికి అందించింది. అయితే పలు కారణాలతో ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించలేదు అమలులో సాధ్యాసాధ్యాలపై ఇంకా ఆలోచన చేస్తూనే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, కమిషన్ తన నివేదికలో ఫిటిమెంట్ పై స్పష్టమైన సిఫార్సులు చేసినట్లు తెలిసింది. మధ్యంతర భృతిని ఇప్పటికే 27 శాతంగా ప్రకటించగా, అందుకు సమానంగానే ఫిట్మెంట్ కూడా ఉంటుందని సమాచారం. తెలంగాణలో మధ్యంతర భృతిని ప్రకటించక పోగా, తాజాగా కమిషన్ సిఫార్సుల్లో 7.5 శాతం ఫిట్ మెంట్ ను సిఫార్సు చేశారు. అయితే రాష్ట్రంలో మాత్రం ఐఆర్ కు సమానంగా ఫిట్మెంట్ ఉండేలా చూడాలని సిఫార్సు చేయడం ఉద్యోగులకు ఉపశమనమని అధికారులు చెబుతున్నప్పటికీ, ఉద్యోగులు మాత్రం 27 శాతమంటే తక్కువ అభిప్రాయపడుతున్నారు. గత పిఆర్‌సిలో ఇచ్చిన దానికన్నా ఇది చాలా తక్కువగా ఉంటోందని వారు విశ్లేషిస్తున్నారు. కాగా తొమ్మిదో వేతన సవరణలో 26 శాతం ఫిట్మెంట్ సిఫార్సు చేయగా, ప్రభుత్వం శాతం ప్రకటించింది. పదో వేతన సవరణలో కూడా 27 శాతం సిఫార్సు చేయగా, అప్పటి ప్రభుత్వం 43 శాతాన్ని ఫిట్మెంట్ గా ప్రకటించింది. ఇక ఇప్పుడు కూడా 27 శాతాన్ని కమిషన్ సిఫార్సు చేయగా, ప్రభుత్వం ఎంతవరకు నిర్ణయం తీసుకుంటుందన్నది వేచి చూడాలి. వాస్తవానికి ఇప్పటికే ఐదు విడతల కరవు భత్యం బకాయిలు ఉన్నాయి. చాలాకాలంగా వీటిని చెల్లించేందుకు ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. నిధుల లేమి కారణంగానే చెల్లింపుల్లో జాప్యం జరుగుతున్నట్లు అధికారులు అంగీకరిస్తున్నారు. ఈ నేపథ్యం లో పిఆర్సి అమలు మరో సవాల్ గా ఉంటుందని ఆర్థికశాఖ చెబుతోంది.

Flash...   SBI సూపర్ హిట్ స్కీమ్.. ఒకేసారి రూ.18 లక్షలు పొందండిలా!