వచ్చే నెల 10న మునిసిపల్ ఎన్నికలు
ఆరోజున సెలవు ప్రకటించాలని ఆదేశించిన నిమ్మగడ్డ
12 నగర పాలికలు, 75 పురపాలికలకు ఎన్నికలు
ఏపీలో పంచాయతీ ఎన్నికలు ముగిసిపోయాయి. ఇప్పుడు మునిసిపల్ ఎన్నికల హడావుడి
మొదలైంది. మార్చి 10న మునిసిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా
కలెక్టర్లకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కీలక ఆదేశాలను జారీ చేశారు. ఎన్నికల
నేపథ్యంలో మార్చి 10న సెలవు దినంగా ప్రకటించాలని ఆదేశించారు. పోలింగ్, కౌంటింగ్
(మార్చి 14) రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఇవ్వాలని తెలిపారు. ఈ రెండు
రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలను ఉయోగించుకోవాలని చెప్పారు.
ఎన్నికలకు పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. సమస్యాత్మకమైన పోలింగ్
కేంద్రాలపై పోలీసుశాఖ ప్రత్యేక దృష్టిని సారించాలని ఆదేశించారు. ఎన్నికల
ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లతో ఈరోజు నిమ్మగడ్డ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా
ఆయన పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో మొత్తం 12 నగర పాలికలు, 75 పురపాలికలకు
ఎన్నికలు జరగనున్నాయి