ఆ 6 శాతం వడ్డీ వద్దనకండి సార్లూ

కోర్టులు వరమిచ్చినా ఉద్యోగ నేతలు కరుణించేనా?

Andhra Pradesh  లో ఉద్యోగులు ఇప్పడు ప్రభుత్వం ఏం చేస్తుంది? తమకు రావాల్సినవి ఎప్పుడు ఇస్తుంది? అనే అంశాలపై ఆలోచించడంతో పాటు కొందరు ఉద్యోగ సంఘాల పెద్దలు, నేతలు ఏ విషయంలో ఏం అంటారో, ప్రభుత్వానికి ఎప్పుడు ఎలా సానుకూలంగా మాట్లాడతారో అని టెన్షన్ పడుతున్నారు. కరోనా వల్ల ఏపీ ప్రభుత్వం మార్చి, ఏప్రిల్ నెలల్లో జీతాలు పెండింగులో పెట్టి ఆనక హైకోర్టు, సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో జనవరి లోపు పెండింగు మొత్తాలు చెల్లించింది. అలాగే పెన్షనర్లకు ఒక నెల పెన్షన్ అలాగే ఆపి ఆనక చెల్లింపులు జరిపింది.

ఆ పెండింగు జీతాలపై 12శాతం వడ్డీ చెల్లించాలని High Court  తీర్పు ఇవ్వగా సుప్రీంకోర్టు ఆ వడ్డీని 6 శాతానికి తగ్గించింది. జీతాలు పెండింగులో ఉంచిన కాలానికి 6శాతం వడ్డీ చెల్లించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇప్పడు ప్రభుత్వం ఆ 6శాతం వడ్డీ చెల్లిస్తుందా? అన్నది ఉద్యోగుల్లో చర్చనీయాంశమయింది. అంతకన్నా ముందే కొందరు ఉద్యోగ సంఘ నేతలు తమకు ఆ వడ్డీ అవసరం లేదంటూ ప్రభుత్వానికి రాసి ఇచ్చేస్తారేమో అన్న చర్చ ఉద్యోగుల్లో సాగుతోంది. 

కరోనా కాలంలో , కొద్ది రోజులుగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి. కరోనా కారణంగా ఉద్యోగుల్లో నెలవారీ ఖర్చులు మందులు, ఇతరత్రా పోషక ఆహారం వినియోగ రూపంలో పెరిగిపోయింది. పీఆర్సీ అమలు, డీఏల విషయంలోను ఉద్యోగులకు సానుకూలమైన నిర్ణయాలూ రాలేదు. మరో వైపు ఉద్యోగ నేతలు ప్రభుత్వ ప్రతినిధులను కలిసి రావడం, సానుకూల వచనాలు పలకడం తప్ప వారు సమర్పించిన వినతి పత్రాల్లో 90శాతం వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. కొందరు ఉద్యోగ సంఘాల నేతలు ఉద్యోగుల ప్రతినిధులుగా కాకుండా ప్రభుత్వ ప్రతినిధులుగా మారిపోయారనే విమర్శలు పెద్ద ఎత్తున ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రసాదించిన 6శాతం వడ్డీ కూడా తమకు వద్దంటారేమో నని ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. కరోనా తొలి నాళ్లలో రాష్ర్ట ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా ప్రస్తుతం మెరుగుపడిందని వార్తలు వస్తున్నాయి. 

Flash...   ఈ వ్యాపారం చేస్తే లైఫ్ సెటిల్ అయినట్టే

కిందటి ఏడాది కన్నా కూడా రెవెన్యూ పెరిగిందని ఈనాడు వంటి ప్రధాన పత్రిక కూడా ఇటీవలే రాసింది. ఈ నేపథ్యంలో  6శాతం వడ్డీని ప్రభుత్వానికి వదులుకోవాల్సిన అవసరం లేదని ఉద్యోగుల్లో చర్చ సాగుతోంది. ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉందని, తాము జీతాలు కోరుకున్నామే తప్ప వడ్డీలు కాదని కొందరు నేతలు ఎక్కడ ప్రకటిస్తారోనని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. సంక్షేమ పథకాలకు నిధులు ఉన్న క్రమంలో ఉద్యోగులకు వచ్చే ఆ కొద్ది పాటి ఆసరాను ఆర్థిక పరిస్థితి కారణంతో వద్దనవలసిన అవసరం లేదని పేర్కొంటున్నారు