విద్యాసంస్థలు జీవో నెం.57ను అమలు చేయకుంటే ఫిర్యాదు చేయండి

 రాజమహేంద్రవరం సిటీ, ఫిబ్రవరి 3: రాష్ట్రంలో ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థలు ఖచ్చితంగా ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం 57ను అమలుచేయాలని, లేకుంటే అటువంటి వాటిపై విద్యార్థులు, తల్లిదండ్రులు కమిషన్‌కు ఫిర్యాదు చేయవచ్చని రాష్ట్ర ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌ సభ్యులు సీఏవీ ప్రసాద్‌, వి.నారాయణరెడ్డిలు పేర్కొన్నారు. రాజమహేంద్రవరం పంతం సత్యనారాయణ ప్రాఽథమిక పాఠశాలలో బుధవారం సాయంత్ర జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తమ కమిషన్‌  గత నాలుగురోజులుగా ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటించి ప్రైవేట్‌ స్కూల్స్‌, కాలేజీలను పరిశీలిం చామన్నారు. ఆయా ప్రాంతాలలో కరోనా నిబంధనలు, జీవో 57 అమలును ఉల్లంఘించిన వాటిని గుర్తించామని వాటికి సోకాజ్‌ నోటీసులు జారీ చేస్తున్నామని చెప్పారు. 

ప్రవేటు విద్యాసంస్థలలో 70 శాతం ఫీజులు మాత్రమే కట్టించుకోవాలని, అదికూడా 30 శాతం చొప్పున మూడు దఫాలుగా కట్టే విధంగా ఆదేశాలు ఉన్నాయని చెప్పారు. వాటిని అతిక్రమిస్తున్న స్కూల్స్‌, కాలేజీలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.  తమ పర్యటనలో ప్రవేట్‌ కాలేజీలలో 30మందిని కూర్చోపెట్టాల్సిన తరగతి గదులలో 150మంది విద్యార్థులను కూర్చోపెడుతున్నారని వాటిని గుర్తించామన్నారు. జీవో నెం.57ను ఉల్లంఘించిన కాలేజీలు విజయవాడలో 12, తిరుపతిలో 14, ఉత్తరాంధ్రలో 9ని గుర్తించామని వాటిపై చర్యలు ఉంటాయని చెప్పారు. తల్లిదండ్రులు స్కూల్‌ ఫీజులు 70 ఽశాతానికి సంభందించి ఎమైనా అనుమానాలు వున్నా, లేక స్కూల్స్‌, కాలేజీల యాజమాన్యాలు ఇబ్బందులు పెట్టిన విద్యాకమిషన్‌ టోల్‌ ఫీ నెం. 9150381111కు ఫోనుచేసి ఫిర్యాదు చేయడం, అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చాన్నారు. ఇక నాడు నేడుకు సంబంధించి రాష్ట్రంలో చేపట్టిన పనులు 90శాతం పూర్తయ్యాయని మిగిలిన పనులు ఈ ఏడాది ఏప్రిల్‌ నాటికి పూర్తిచేయాలని  హెచ్‌ఎంలకు సూచిస్తున్నామన్నారు. సమావేశంలో అర్బన్‌ డీఐ బి.దిలిప్‌కుమార్‌, పాఠశాల హెచ్‌ఎం బర్రే చైతన్యకుమార్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Flash...   LG StanbyME Go 27 మార్కెట్‌లోకి LG సూపర్‌ టీవీ.. బ్రీఫ్‌కేసులో పెట్టుకుని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు ..!